ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా హర్రర్ కామెడీ జోనర్ చిత్రాలే ఒక ట్రెండ్ సెట్ చేస్తోంది. స్త్రీ, స్త్రీ 2, భేడియా, ముంజ్యూ తదితర చిత్రాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఇలాంటి జోహార్ తోనే బాలీవుడ్లో రష్మిక, ఆయుష్మాన్ ఖురానా నటించిన తాజా చిత్రం థామా. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఆదిత్య సర్పద్కర్ తెరకెక్కించారు. ఈ చిత్రం నిన్నటి రోజున భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. మరి ఏ మేరకు ఈ సినిమాతో మెప్పించారో ఒకసారి చూద్దాం.


స్టోరీ విషయానికి వస్తే:
అలోక్ గోయల్(ఆయుష్మాన్ ఖురానా) ఒక జర్నలిస్టుగా ఉంటారు. అడవిలో అడ్వెంచర్ చేయడానికి తన స్నేహితులతో కలిసి వెళ్లినప్పుడు ఆ సమయంలో ఆయన పైన ఎలుగుబంటి దాడి చేస్తుంది. అప్పుడే అలోక్ ను కాపాడడానికి తడకా(రష్మిక మందన్న) వస్తుంది. అయితే ఈమె మనిషి కాదు బేతాల్ జాతికి చెందింది. వారి యొక్క నియమాల ప్రకారం మనుషుల  రక్తం తాగకూడదు. కానీ వాళ్ల పూర్వికుడైన థామా నాయకుడు యక్షసన్ (నవాజుద్దీన్ సిద్ధిఖి) ఆ నియమాలకు విరుద్ధంగా  వ్యవహరిస్తారు. అలా అలోక్ ను కాపాడే ప్రయత్నంలో తడకా చిక్కుల్లో పడుతుంది. తమ జాతికి వ్యతిరేకంగా ఉన్న ఆ నాయకుడికి బుద్ధి చెప్పే ఒక ప్రేమ జంటగా కనిపించారు. ఆ తర్వాత అలోక్ తో పాటు తడకా ఢిల్లీకి వెళుతుంది. తరువాత ఏం జరిగింది? మధ్యలో భేడియా(వరుణ్ ధావన్) ఎందుకు వచ్చారు ?అనేది మిగిలిన కథ.


సినిమాకు ప్లస్ - మైనస్:
గతంలో మ్యాడాక్ సంస్థ నుంచి విడుదలైన భేడియా, స్త్రీ, స్త్రీ 2 వంటి చిత్రాల లాగే థామా చిత్రాలకు లింక్డ్ స్టోరీ రాసుకున్నట్లు తెలుస్తోంది డైరెక్టర్. గత చిత్రాలలోగా హైలెట్స్ లేవు , కాని సినిమా అయితే పర్వాలేదనే టాకు వినిపిస్తోంది. నటీనటుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే.. రష్మిక,ఆయుష్మాన్ మద్య సీన్స్ చాలా నెమ్మదిగా సాగుతాయి. ఇక ఇంటర్వెల్స్ సీన్ కూడా జస్ట్ ఓకే అన్నట్టుగా కనిపిస్తోంది. సెకండాఫ్ లోనే అసలైన కథ మొదలు. బేతాళుడు కాన్సెప్ట్ గురించి బాగానే వివరించిన హర్రర్ థ్రిల్లర్ అని చెప్పిన కానీ భయపట్టే అంశాలు అంతగా కనిపించలేదు. గతంలో విడుదలైన స్త్రీ, ముంజ్యూ వంటి చిత్రాలు హర్రర్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నది. కానీ ఈసారి థామాలో ఆ స్థాయిలో భయపెట్టే సిన్స్ లేవు. అలాగే ఇందులో భేడీయా , స్త్రీ 2 వంటి చిత్రాలకు లింక్ పెట్టిన సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. అలాగే సినిమా చివరిలో పార్ట్ 2 ఉంటుందంటు హింట్ ఇచ్చారు.

నటీనటులు:
ఆయుష్మాన్ ఖూరానా ఇందులో అద్భుతంగా నటించారు. కామెడీతో యాక్షన్ సీన్స్ లలో అద్భుతంగా చేశారు. రష్మిక గ్లామర్ తో పాటు నటన కూడా అద్భుతంగా నటించింది. చాలా సీన్స్ రష్మిక చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖి ఉన్నంతసేపు హైలెట్ గా ఉన్నారు. అలాగే సెకండ్ హాఫ్ లో పరేష్  చుట్టూ అల్లుకున్న సీన్స్ హైలైట్ గా ఉన్నాయి. వరుణ్ ధావన్ ఉన్న ఒకే ఒక సీన్ అద్భుతంగా ఆకట్టుకుంది.

టెక్నికల్:
సంగీతం , బిజిఎం  హైలెట్గా ఉంది. ఎడిటింగ్ పరంగా చూస్తే మొదటి భాగం వీక్ ఉన్నప్పటికీ అక్కడక్కడ సీన్స్ కొంతమేరకు లెంత్గా ఉన్నాయట. ఇంటర్వెల్ తర్వాత సినిమా ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. డైరెక్టర్ రాసుకున్న కథ ముందు భాగాలకు లింక్ పెడుతూ రాసుకున్నప్పటికీ కానీ ఆ స్థాయిలో ఆకట్టుకోలేదు.అలాగే తెలుగు డబ్బింగ్ సరిగ్గా లేదు, హిందీ వర్షన్ లో చూడడమే బెటర్ అంటూ తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: