ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు ఏడేళ్లు పూర్తయింది. కానీ ఇప్పటికీ ప్రభాస్‌తో రష్మిక కలసి నటించాలన్న ఆశను వదలలేదు. “ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్‌ల సినిమాలల్లో ఒక మంచి పాత్ర దొరికితే ఎప్పటికీ మరిచిపోను. ఆ రోజు కోసం నేను ఎదురుచూస్తున్నాను” అంటూ ఆమె గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. “ఇంకా రష్మికకు ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ ఎందుకు రాలేదు?” అనే ప్రశ్నతో నెటిజన్లు చర్చలు మొదలుపెట్టారు. అభిమానులు కూడా “ఈ జోడీ స్క్రీన్‌పై కనబడితే మంత్ర ముగ్ధులమైపోతాం” అంటూ చెప్పుకొస్తున్నారు.
ఇక ప్రభాస్ విషయానికి వస్తే — నేడు ఆయన పుట్టినరోజు . ఈ సందర్భంగా సోషల్ మీడియా అంతా ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షల సందడితో మునిగిపోయింది. అభిమానులు, సినీ ప్రముఖులు అందరూ రెబల్ స్టార్‌కు హృదయపూర్వకంగా విషెస్ తెలుపుతున్నారు. అందులో మోహన్ బాబు చెప్పిన విషెస్ మాత్రం ప్రత్యేకంగా వైరల్ అవుతున్నాయి. ఆయన, “నీకు త్వరగా పెళ్లి కావాలి ప్రభాస్..! అరడజను పిల్లలతో ఆనందంగా జీవించాలి” అంటూ చెప్పిన ఆశీర్వాదం అభిమానుల హృదయాలను తాకింది.ఇలా ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రష్మిక మందన్నా ఆకాంక్ష, మోహన్ బాబు బ్లెస్సింగ్స్, అభిమానుల హంగామా — అన్నీ కలసి సోషల్ మీడియాలో పెద్ద సంబరంగా మారాయి.అభిమానులు ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నారు —“ప్రభాస్ – రష్మిక కాంబినేషన్ ఒక రోజు తెరపై చూడాలి..!”. చూద్దాం మరి ఏం జరుగుతుందో...?
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి