ఇక తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెట్టింది. ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్‌లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు తో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రావడంతో ఇతర భాషల ప్రేక్షకులు కూడా ఓజీని ఆస్వాదించగలుగుతున్నారు. అయితే, అభిమానులు ఆశించినట్లుగా ఓటీటీ వెర్షన్‌లో అన్‌కట్ లేదా ఎక్స్‌టెండెడ్ వెర్షన్ రాలేదు. థియేటర్లలో చూపించినట్లుగానే అదే కట్‌తో సినిమా స్ట్రీమింగ్ అవుతుండటం వల్ల కొంతమంది అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. “డిలీటెడ్ సీన్స్ లేదా బీహైండ్ ద సీన్స్ యాడ్ చేసి ఉంటే బాగుండేది” అని వారు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మి, ప్రియాంక మోహన్, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు థమన్ సంగీతం, జార్జ్ విలియమ్స్ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మించింది. మొత్తంగా, ఓజీ ఇప్పుడు థియేటర్ల తర్వాత ఓటీటీ వేదికలో కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి