- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల ఆమె నటించిన హిందీ హారర్ కామెడీ చిత్రం “థామా” మంచి టాక్‌తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు రష్మిక నటించిన తాజా తెలుగు చిత్రం “ది గర్ల్‌ఫ్రెండ్” నవంబర్ 7న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ రొమాంటిక్ డ్రామాను నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నాడు. రాహుల్ తన సినిమాల్లో భావోద్వేగాలతో అద్భుతంగా తెర‌కెక్కించాడు. దీంతో ది గ‌ర్ల్‌ఫ్రెండ్ సినిమాపై సైతం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఈ సినిమాలో రష్మిక మందన్నకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నాడు. రష్మిక పాత్ర చాలా ప్రత్యేకంగా, కొత్త కోణంలో ఉండబోతోందని సమాచారం. ఆమె ఇప్పటి వరకు చేసిన రోల్స్‌కి భిన్నంగా, ఈ సినిమాలో మరింత మెచ్యూర్, భావోద్వేగపూరితమైన పాత్రలో కనిపించనుందని దర్శకుడు తెలిపాడు. సపోర్టింగ్ క్యాస్ట్‌ విషయానికి వస్తే, రావు రమేష్, రోహిణి, శ్రీనివాస్ అవసరాల, వివేక్ లగ్నేన్ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అదనంగా, అందాల భామ అనూ ఇమ్మాన్యుయేల్ ప్రత్యేక పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది.


సాంకేతికంగా కూడా ఈ సినిమా హై క్లాస్‌గా ఉండబోతోంది. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన కాంపోజ్ చేసిన మెలోడీ ట్రాక్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ విలువలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, “ది గర్ల్‌ఫ్రెండ్” ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తంగా రూ.14 కోట్లకు సొంతం చేసుకుందట. దీని వల్లే సినిమాపై మరింత హైప్ ఏర్పడింది. విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించగా, అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. అక్టోబర్ 25న విడుదల కానున్న ట్రైలర్‌పై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. రష్మిక అభిమానులకు ఈ సినిమా మరో హిట్ కానుందని ట్రేడ్ వర్గాలు విశ్వసిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: