ఈ షూట్ కోసం రాజమౌళి బృందం భారీ స్థాయిలో సెట్ పనులను ప్రారంభించింది. ముఖ్యంగా కాశీ క్షేత్ర వాతావరణాన్ని ప్రతిబింబించే విశాలమైన సెట్‌ను నిర్మిస్తున్నారని సమాచారం. ఈ సెట్లో మహేష్ బాబు పాల్గొనే యాక్షన్ సీన్స్, కొన్ని కీలకమైన సంభాషణా సన్నివేశాలు, అలాగే ఒక ప్రత్యేక సాంగ్ సీక్వెన్స్‌ను కూడా చిత్రీకరించనున్నారు. ఈ నెల రెండో వారం నుంచే ఈ మేజర్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని చెబుతున్నారు.సాధారణంగా రాజమౌళి ప్రతి షెడ్యూల్ మధ్య విరామాలు తీసుకుంటూ సినిమాను పూర్తి చేస్తారు. కానీ, ఈసారి మాత్రం ఆయన పూర్తిగా డిఫరెంట్‌గా ఆలోచించారట. ఫస్ట్ టైమ్‌గా బ్రేక్ లేకుండా లాంగ్ కంటిన్యూస్ షూట్ చేయాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఇందుకోసం ఆయన మొత్తం యూనిట్‌ను ముందుగానే కంటిన్యూస్ డేట్స్‌తో లాక్ చేశారట.
ఇక కథ విషయానికొస్తే, ఇటీవల రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ –“నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా రచయిత విల్బర్ స్మిత్ అభిమానులం. ఆయన రచనలలో ఉండే అడ్వెంచర్, ఎమోషన్, సస్పెన్స్ అంశాలు మాకు చాలా ఇష్టం. అందుకే ఆయన నవలల నుండి ప్రేరణ పొందుతూ ‘SSMB 29’ కథను రాసాను.”అని చెప్పుకొచ్చారు.దీంతో ఈ సినిమా ఒక గ్లోబల్ అడ్వెంచర్ థ్రిల్లర్గా ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకెళ్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా విభిన్న లొకేషన్లలో ఈ సినిమా షూట్ జరగనున్నట్లు తెలిసింది.
ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటించనుండటం మరింత హైలైట్‌గా మారింది. అదనంగా హాలీవుడ్ స్థాయి టెక్నీషియన్లు కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమవుతారని సమాచారం. ఈ సినిమాను అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కించేందుకు మేకర్స్ భారీ బడ్జెట్ కేటాయించారు.మొత్తానికి, రాజమౌళి – మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ‘SSMB 29’ సినిమా టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ సినిమా చరిత్రలో ఒక కొత్త మైలురాయిగా నిలవడం ఖాయం. ఇప్పుడు ఈ మూడు నెలల లాంగ్ షెడ్యూల్‌పై అంతా కళ్లేసి ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి