1987 సమయంలో  నిర్మాతలు అంటే చాలామందికి టక్కున గుర్తుకొచ్చేది  ఎమ్మెస్ రాజు పేరు మాత్రమే.. అయితే ఈయన సుమంత్ ప్రొడక్షన్ పేరుతో నిర్మాణరంగం ప్రారంభించి అద్భుతమైన సినిమాలకు ప్రొడ్యూసింగ్ చేశారు. ఆయన చేసిన చాలా సినిమాలు ఇప్పుడున్నటువంటి స్టార్ హీరోలకు లైఫ్ ఇచ్చాయని చెప్పవచ్చు.. ముఖ్యంగా మనవాడొస్తున్నాడు అనే సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి నిర్మాతగా అడుగు పెట్టిన ఎమ్మెస్ రాజు లాక్ అప్ డెత్, దేవి,దేవి పుత్రుడు, స్ట్రీట్ ఫైటర్, మనసంతా నువ్వే, నీ స్నేహం, వర్షం, నువ్వోస్తానంటే నేనొద్దంటానా,ఆట, వాన, మస్కా వంటి ఎన్నో అద్భుతమైన హిట్ చిత్రాలకు  నిర్మాతగా చేశారు. అంతేకాదు అప్పట్లో ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ అంటే ఈయన పేరే వినబడేది.. అలా ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు ఓ వెలుగు వెలిగిన ఎమ్మెస్ రాజు ఆ తర్వాత నిర్మాణ రంగానికి దూరమైపోయారు.. అయితే తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్ కు సంబంధించిన విషయాలు పంచుకున్నారు.. 

అయితే ఎమ్మెస్ రాజు కేవలం నిర్మాతగానే కాకుండా తూనీగా తూనీగా,డర్టీ హరి, సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ వంటి చిత్రాలకు దర్శకుడిగా పని చేశారు.. కానీ కొన్ని చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడడంతో ఆయన సినిమాలు డైరెక్షన్ చేయడం ఆపేశారు. తన కొడుకు సుమంత్ అశ్విన్ ని తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేశారు. చక్కిలిగింత, కేరింత, లవర్స్, రైట్ రైట్, హ్యాపీ వెడ్డింగ్ తదితర సినిమాల్లో హీరోగా చేసినటువంటి సుమంత్ సరైన గుర్తింపు తెచ్చుకోలేకపోయారు. అయితే ఎమ్మెస్ రాజు తాజా ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడే సమయంలో యాంకర్ మీరు హీరోయిన్ తో గొడవ పడ్డారట కదా.. అలాగే సినిమా మధ్యలోనే వదిలేశారంట కదా నిజమేనా అని ప్రశ్నించింది.. దీనిపై స్పందించిన ఎమ్మెస్ రాజు.. నేను హీరోయిన్ తో గొడవ పడ్డానని వార్తలు వస్తున్నాయి.. అయితే ఆ హీరోయిన్ ఎవరో మీరు చెబితే నేను ఏం జరిగిందో చెబుతా.. ఎవరో స్టార్ హీరోయిన్  అని అంటున్నారు..

కానీ సినిమాల విషయంలో నేను చాలా స్ట్రిట్ గా ఉంటాను.. ఎంత పెద్ద హీరో హీరోయిన్ అయినా సరే నాతో గొడవ పెట్టుకుంటే మాత్రం తప్పకుండా ఎంతటి సినిమా అయినా సరే ఆపేస్తాను. కోట్లు పోయినా పర్లేదు నా ఆత్మాభిమానాన్ని చంపుకోను.. ఆ విధంగా అప్పట్లో ఒక పెద్ద ప్రాజెక్టును కూడా ఆపబోయాను. కానీ ఆ సినిమాలో పని చేసే వాళ్లంతా నన్ను బ్రతిమిలాడితే మళ్ళీ సినిమా కంటిన్యూ చేశా  అంటూ ఎమ్మెస్ రాజు చెప్పుకొచ్చారు.. నాకు ఈగో హర్ట్ అయితే డబ్బు పోతే పోయింది, ఆత్మాభిమానాన్ని చంపుకొని మళ్ళీ ఆ సినిమా కంటిన్యూ చేయను.. మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్లీ అక్కడికే పడిపోతాం.. పోయేది ఏమీ ఉండదంటూ చెప్పుకోచ్చారు. కానీ ఆ హీరోయిన్ ఎవరు ఏం సినిమా అనేది మాత్రం అక్కడ బయటకు రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: