ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ జనాల్లో  నానుతున్న పేరు అఖండ-2.. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అఖండ-2 సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడమే.. అఖండ-2 మూవీ ట్రైలర్ శుక్రవారం రోజు రాత్రి విడుదలైంది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ బెంగళూరులోని చిక్కబళ్లాపురం లో జరిగింది. ఈ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించడంతో ఎంతోమంది బాలయ్య అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అంతేకాదు అఖండ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్ కూడా చీఫ్ గెస్ట్ గా వచ్చారు.అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ బాలకృష్ణ అభిమానులకి పిచ్చపిచ్చగా నచ్చేసింది. అఖండ-2 తో మరోసారి బాలకృష్ణ థియేటర్లలో విధ్వంసం చేయబోతున్నారని ట్రైలర్ చూసిన ప్రేక్షకులు రివ్యూలు ఇస్తున్నారు.

అయితే తాజాగా బాలకృష్ణ అఖండ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మెయిన్ టార్గెట్ ఇదే అని అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతకీ బాలకృష్ణ అఖండ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో ఏం మాట్లాడారు..ఆయన టార్గెట్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం. బాలకృష్ణ అఖండ-2 ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మాట్లాడుతూ..సమాజపు మూలాలను, హైందవ ధర్మాన్ని అఖండ -2 మూవీ ఆవిష్కరిస్తుంది.. నేను నటించే ప్రతి సినిమాలో లాగే అఖండ-2 లో కూడా సమాజానికి,యువతకి ఉపయోగపడే సందేశం ఉంటుంది. అఖండ-2 కన్నడ, తెలుగు సినిమా కాదు.. ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా మూవీ అంటూ అఖండ-2 మూవీ గురించి గొప్పగా చెప్పుకొచ్చారు.

 ఇక బాలకృష్ణ మాటలు వింటుంటే ఆయన మెయిన్ టార్గెట్ యూత్ తో పాటు హైందవ ధర్మమే అని అర్థమవుతుంది. ఇక ఈ మధ్యకాలంలో హిందూ ధర్మాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న సినిమాలకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తుంది. అందుకే బాలకృష్ణ మరోసారి అఖండ -2 తో హిందువులను ఆకర్షించడానికి వచ్చేస్తున్నారు. ఇక బోయపాటి డైరెక్షన్లో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 మూవీ 2022లో విడుదలైన అఖండ మూవీకి సీక్వెల్ గా తెరకెక్కింది. ఈ మూవీ వచ్చే నెల అనగా డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.ఇక విడుదలకు మరికొద్ది రోజులు ఉండగానే అఖండ-2 మూవీ ప్రమోషన్స్ మొదలెట్టేసారు చిత్ర యూనిట్.

మరింత సమాచారం తెలుసుకోండి: