అమెరికాలో పర్యటించే అనేక దేశాలకు చెందిన వారికి ఆంక్షలను కొంతమేరకు సడలించింది. అమెరికాకు వచ్చే వారు ముందుగానే వ్యాక్సిన్ తప్పక వేసుకుని ఉండాలని తెలుస్తోంది. ఇంతకు ముందు పెట్టిన క్వారంటైన్ నిబంధనను వెనక్కు తీసుకుంది. కొత్తగా ప్రవేశ పెట్టిన కొత్త నిబంధనలు అన్నీ కూడా నవంబర్ నుండి అమలు లోకి వస్తాయని తెలిపింది. విమానంలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ ముందుగానే వ్యాక్సిన్ వేసుకున్నట్లు తెలిపే సర్టిఫికేట్ ను వెంట తెచ్చుకోవడం తప్పనిసరి. అంతే కాకుండా మీ ప్రయాణానికి మూడు రోజులకు ముందు కరోనా టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. అందులో వచ్చిన నెగిటివ్ రిపోర్ట్ ను ఇమ్మిగ్రేషన్ సమయంలో చూపించాలి.

వివిధ దేశాల నుండి తిరిగి వస్తున్న  వారు కూడా ఒక్క రోజు ముందు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలి. అంతే కాకుండా అమెరికాకు చేరుకున్న తర్వాత కూడా మరోసారి టెస్ట్ చేయించుకోవాలి. ముఖ్యంగా సిడిసి తెచ్చిన కొత్త నిబంధన ప్రకారం విమాన యాన సంస్థలు అమెరికా ప్రయాణించే ఒక్క ప్రయాణికుడి నుండి వారి పూర్తి వివరాలు సేకరిస్తుంది. వారి నుండి ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ, అమెరికాలో వారు నివసించే అడ్రస్ లాంటి తదితర వివరాలు తీసుకోవాలి. అప్పుడే ఒకవేళ వారికి పొజిషన్ వస్తే, వారిని కలిసిన మిగతా వారి వివరాలు తెలుసుకుని కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు.

ఇప్పుడు నవంబర్ నుండి అమలు కానున్న నూతన నిబంధనలను అతిక్రమించినా సక్రమంగా పాటించకున్నా వారిపై తగిన చర్యలు తప్పవని సి డి సి గట్టిగా చెప్పింది. ప్రస్తుతానికి అయితే అమెరికాకు వెళ్ళవలసిన వారు ఆనందించాల్సిన విషయమే. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన కఠినమైన నిబంధనలను ఇప్పుడు సడలించింది. ఈ నూతన నిబంధనల పట్ల ఇండియన్స్ అంతా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నిబంధనలు అందుబాటులోకి రావడానికి ఇంకా కొన్ని రోజుల సమయం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

NRI