మ‌న దేశంలో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వ ప‌న్ను అని రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌న్ను అని ప్ర‌జ‌ల‌ను దోచు కుంటున్నారు. ఇప్ప‌టికే మ‌న హైద‌రాబాద్ న‌గ‌రంలో లీట‌ర్ పెట్రోల్ రూ.111.91 గా ఉంది. అలాగే డిజిల్ ధ‌ర రూ. 105.08 గా ఉంది. ఇలా పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు ఆకాశాన్ని అంటుతుంటే ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాల పై తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. అయితే మ‌న దేశంలో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు పెర‌గ‌డంతో ఇత‌ర దేశ‌ల‌లో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు ఎలా ఉన్నాయో అని ప్ర‌జ‌లు తెలుసు కుంటున్నారు. అయితే కొన్ని దేశాల్లో పెట్రోల్ డిజిల్ ధ‌ర‌లు చాలా త‌క్కువ గా ఉన్నాయి. ఎంతగా అంటే మ‌న దేశంలో అగ్గి పెట్టే ల క‌న్న త‌క్కువ ధ‌ర‌ల్లో పెట్రోల్ ల‌భిస్తుంది.అయితే మ‌న దేశం క‌న్న త‌క్కువ ధ‌ర‌ల్లో పెట్రోల్ అమ్ముతున్న దేశాల సంఖ్య చాలానే ఉంది. అయితే ముఖ్యం గా ముఖ్యం గా వెనుజువెలా అనే దేశంలో పెట్రోల్ అతి త‌క్కువ ధ‌ర కే ల‌భిస్తుంది. ఎంత అంటే అక్క‌డ లీట‌ర్ పెట్రోల్ కేవ‌లం 0.02 డాల‌ర్ల కే ల‌భిస్తుంది. అంటే మ‌న క‌రెన్సీ లో రూ. 1.50 కే అన్న‌ట్టు. అయితే ఈ ఆఫ్రికా దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు ఉన్నాయి కానీ చ‌మురు సంక్షోభాలు లేవు. అందుకు అక్క‌డ పెట్రోల్ డిజిల్ లు చాలా తక్కువ ధ‌ర కే వ‌స్తాయి. దీని త‌ర్వాత తక్కువ ధ‌ర కే పెట్రోల్ ల‌భించే దేశం ఇర‌న్‌. ఇరన్ లో ఒక లీట‌ర్ పెట్రోల్ కేవ‌లం 0.06 డాలర్లు ఉంటుంది. అంటే మ‌న ఇండియా క‌రెన్సీ లో రూ. 4.51 . అదే విధంగా సిరియా లో 0.23 డాల‌ర్లు అంటే మ‌న దేశం క‌రెన్సీ ప్ర‌కారం రూ. 1.7 కే లీట‌ర్ పెట్రోల్ దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: