సాధారణంగా ఎవరైనా చన్నీటితోనో వేడి నీటితోనే స్నానం చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం అందరికీ తెలిసింది కూడా ఇదే  కానీ కరెంట్ తో స్నానం చేయడం గురించి ఎప్పుడైనా విన్నారా.. కరెంట్ తో స్నానం చేయడం ఏంటండీ.. కరెంటు ముట్టుకుంటేనే ప్రాణాలు పోతాయ్.. అలాంటిది కరెంట్ తో స్నానం చేయడం ఏంటి అలాంటి కాన్సెప్ట్ కూడా ఉందా అని అంటారు ఎవరైనా..  కానీ జపాన్ లో మాత్రం ఎంతోమంది అప్పుడప్పుడూ కరెంటు స్నానాలు చేస్తూ ఉంటారట.


 ఇక ఈ కరెంటు స్నానాలను డెంగీ బరో అని పిలుస్తూ ఉంటారట. నీళ్లకు కరెంటు కు లింకు పెట్టొద్దని చాలా మంది నిపుణులు చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక నీళ్లలో కరెంట్ పెట్టాము అంటే చాలు మనిషి ప్రాణాలు తీయడం ఖాయం అని హెచ్చరిస్తూ ఉంటారు. ఇక్కడ మాత్రం జపాన్లో కరెంటు తో స్నానం చేస్తూ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నారు.ఇది ఎలా సాధ్యం అవుతుంది అని అనుకుంటున్నారు కదా.. అయితే హై ఓల్టేజీ కరెంట్ కాకుండా లోవోల్టేజీ కరెంటుతో స్నానం చేస్తూ ఉంటారట అక్కడ జనాలు. దీంతో నీళ్లలో కరెంట్ పెట్టిన తర్వాత అందులో కి దిగినప్పటికీ పెద్దగా షాక్ వస్తున్నట్లుగా అనిపించదట.



 ఇక జపాన్ లో ఇలా కరెంటు స్నానాల కోసం ప్రత్యేకంగా బాత్ టబ్ లు, చిన్నపాటి స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటాయట. ఇక వీటిల్లో రెండు వైపులా లోహపు పట్టీలను అమర్చి విద్యుత్ వైర్ లో ఉండే రెండు తీగలను ఇక వీటికి అనుసంధానం చేయడం చేస్తూ ఉంటారట. ఇక ఆ తర్వాత విద్యుత్ సరఫరా చేసి స్నానాలు చేయడానికి అనుమతి ఇస్తూ ఉంటారు. సాధారణంగా మనం బయటికి వెళ్లినప్పుడు హోటల్లో కాఫీ  తాగడం లాంటివి చేస్తూ ఉంటాము. జపాన్ లో  కొంతమంది రిలాక్సేషన్ కోసం కరెంటు స్నానాలు చేస్తూ ఉంటారట.  ఈ కరెంట్ స్నానాల పద్ధతి 18వ శతాబ్దం నుంచి కొనసాగుతూ ఉందట. ఏదేమైనా ఈ కొత్తరకం స్నానం మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: