చిన్న దేశం అయినప్పటికీ తమ దేశ రక్షణ విషయంలో ఇజ్రాయిల్ ఎంత ఖచ్చితత్వంతో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమ దేశ భద్రతకు భంగం వాటిల్లుతుంది  అని భావిస్తే ఎవరినీ లెక్క చేయకుండా దాడులకు పాల్పడుతూ ఉంటుంది. అంతే నిఘా విభాగంలో  కూడా ప్రపంచంలోనే ఇజ్రాయిల్ మొదటి స్థానంలో ఉంది అని చెప్పాలి. అలాంటి ఇజ్రాయిల్ ఇప్పటికే ఇరాన్లోని పాలస్తీనా ఉగ్రవాదుల కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ఇక ఇరాన్ లో ఉన్న ఎన్నో ఆయుధ కర్మాగారాలకు దాడులకు కూడా పడుతూ ఉండటం గమనార్హం. ఇప్పుడు మరోసారి ఇరాన్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయిల్.



ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచే ఇరాన్ లో అణ్వాయుధాల తయారీ జరుగుతుంది అంటూ ఎన్నో రోజుల నుంచి ఐక్యరాజ్యసమితిలో సభ్య దేశాలు ఆరోపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే తమ దేశంలో అణ్వాయుధాల తయారీ జరగడం లేదని కావాలంటే నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి రాజ్య సమితి తో ఇరాన్ ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కాగా 2015 లో చోటు చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ఇప్పటికీ ఐక్యరాజ్య సమితి ఆంక్షలు సడలించలేదని అలాంటప్పుడు ఒప్పందం ఎందుకు అంటూ ఇక ఆయా ప్రదేశాల్లో ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆఫ్ చేసింది ఇరాన్.



 అయితే అటు ఇరాన్ మాటలను నమ్మనీ ఇజ్రాయిల్ మాత్రం ఇరాన్ అణు ఆయుధాలను తయారు చేస్తుంది అని అనుమానంతో ఇప్పటికి ఎంతో మంది శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హతమార్చింది. ఇక అణు ఆయుధాలు తయారు చేస్తున్నారు అని అనుమానం ఉన్న ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు మరో సారి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయిల్. ఇరాన్ లో అణు ఆయుధ తయారీ తాము తప్పకుండా అడ్డుకుని తీరుతాం అంటూ తేల్చి చెప్పింది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అని ఆసక్తికరంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: