
చోద్యం కాకపోతే కొళాయి నీళ్లతో ముక్కును కడుక్కోవడం ద్వారా ప్రాణాలు పోవడం జరుగుతుందా.. కానీ ఇక్కడ మాత్రం అదే జరిగింది. ట్యాప్ వాటర్ తో ముక్కు కడుక్కున్న ఒక వ్యక్తి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నీటి లో అమీబా అతని శరీరంలోకి ప్రవేశించి చివరికి ప్రాణం తీసేసింది. అమెరికా లోని సౌత్ ఫ్లోరిడా లో ఈ ఘటన వెలుగు చూసింది. అయితే అత్యంత అరుదుగా సోకే మెదడు తినే అమీబా నిక్లేరియా పౌలూరి కారణం గానే మరణించాడని వైద్యులు వెల్లడించారు.
అయితే ఇక ఇది సోకితే దాదాపు మనిషి బ్రతకడం చాలా కష్టం అంటూ డాక్టర్లు కూడా తెలిపారు. కాగా సరస్సులు, నదులు, వేడి నీటి బుగ్గలు, వంటి మట్టి వెచ్చటి మంచినీటిలో అమీబా నివసిస్తూ ఉంటుందట. ఇక అమీబాతో కలిసితమైన నీరు ముక్కులోకి ప్రవేశించినప్పుడు అది మానవ శరీరంలోకి చేరేందుకు అవకాశం ఉంటుందట. ఇక మెదడుకు చేరి కణజాలాన్ని మొత్తం ప్రభావితం చేసి ప్రాణాలు తీసేస్తుందట. అయితే అమెరికాలో ప్రతి ఏడాది ముగ్గురు ఈ అరుదైన వ్యాధి బారినపడి చనిపోతున్నట్లు రిపోర్టులు కూడా చెబుతూ ఉన్నాయి.