
భయపడినట్లుగానే సిక్స్ ఫర్ జస్టిస్ తీవ్రంగా స్పందిస్తోంది. హిందువులంతా తక్షణం కెనడాను వదిలి పెట్టాలని ఎస్ఎఫ్జే హెచ్చరించింది. నిజ్జర్ హత్యకు గాను భారతదేశానికి మద్దతు హింసను ప్రోత్సహించినందుకు కెనడాను విడిచిపెట్టాలని అల్టీమేటం జారీ చేసింది. ఖలీస్థాన్ మద్దతుదారుల ప్రసంగాలు, వ్యక్తీకరణను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
ఈ మేరకు ఆసంస్థ కీలక నేత గురు పత్వంగ్ సింగ్ పన్నూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇదంతా సిక్కు రాజ్యం, ఖలీస్థానీ రాజ్యం అంటూ ప్రకటనలు చేశారు. భావ ప్రకటన స్వాతంత్ర్యం పేరుతో అతను చేస్తున్న ప్రకటనలను నియంత్రిచడంలో జస్టిన్ ట్రూడో విఫలమయ్యారు. దీంతో కెనడా హిందువులంతా ఒక్కటై అక్కడి ప్రభుత్వాన్ని నిలదీశారు. గురు పత్వంగ్ సింగ్ పన్నూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు దీనిపై లేఖ రాశారు. అతను చేసిన వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని అందులో వివరించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు.
పన్నూ చేసిన వ్యాఖ్యలు భారత హిందువులపైనే కాదు కెనడీయన్లపై కూడా ప్రభావం చూపుతాయని పేర్కొంది. నిజ్జర్ హత్యను అడ్డుపెట్టుకొని విధ్వంసాలు సృష్టించాలని చూస్తున్నాడని లేఖలో వివరించింది. ఈ నేపథ్యంలో కెనడాలోని హిందువులు ఎదుర్కొంటున్న సమస్యలపై పొరుగున ఉన్న భారతీయ అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేశారు. మౌనంగా ఉండటం వల్ల ద్వేషపూరిత నేరాలను ఆమోదించవద్దని కెనడా ప్రభుత్వాన్ని కోరింది. ట్రూడో భావ ప్రకటనా స్వేచ్ఛ, ఉగ్రవాద స్వేచ్ఛను కలుపవద్దని కోరారు. కెనడియన్ గడ్డపై హిందూ పవిత్ర స్థలాలను అపవిత్రం చేయడం..ఖలీస్థానీ ఉగ్రవాదులు కెనడీ హిందువులను పదేపదే బెదిరించడం ఆందోళనకరమన్నారు.