సాధారణంగా ఆర్మీలో చేరాలనీ.. ఇక దేశ సరిహద్దుల్లో పహార కాస్తు పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలని ఎంతో మంది యువకులు అనుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆర్మీకి వెళ్లేందుకు ఫిట్నెస్ ని కాపాడుకుంటూ ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే కొంతమంది కోరిక నెరవేరి చివరికి ఆర్మీలో ఉద్యోగం సంపాదిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇంకొంత మంది యువకులు మాత్రం ఆర్మీ లాంటి రిస్కి జాబులు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఏదో ఉన్నంతలో జాబ్ చేసుకుని వచ్చిన దాంట్లో సర్దుకుపోయి.. ఎంతో సంతోషంగా బ్రతికితే సరిపోతుంది కదా అని అనుకుంటూ ఉంటారు.


 అయితే ఇప్పుడు ఇలా ఎవరైనా అనుకుంటున్నారు అంటే వారికి షాక్ తప్పదు అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఆర్మీలోకి వెళ్లడం ఇష్టం లేకపోయినా.. ఇక ఇప్పుడు తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సిందే. దీనికి సంబంధించి ఏకంగా ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి అని చెప్పాలి. అదేంటి ఇష్టం లేకపోయినా ఆర్మీలో చేరడం ఏంటి అనుకుంటున్నారు కదా.. అంతలా కంగారు పడకండి.. ఇది మన దేశంలో కాదు మయన్మార్ లో. ఆర్మీ ప్రభుత్వం ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ దేశ పౌరులు అందరికీ కూడా ఊహించని షాక్ ఇచ్చింది అని చెప్పాలి.


 మయన్మార్ దేశంలో అటు సైనికుల సంఖ్య రోజుకి తగ్గిపోతున్న నేపథ్యంలో  అక్కడి ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్ల నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉన్న పురుషులు.. 18 ఏళ్ల నుంచి 27 ఏళ్ల లోపు వయసు ఉన్న మహిళలు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రెండేళ్లపాటు ఇక ఆ దేశపు ఆర్మీలో పని చేయాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. 45 ఏళ్లలోపు స్పెషలిస్ట్ డాక్టర్లు మూడేళ్లు సైన్యంలో సేవ చేయాలి అంటూ ఆదేశించింది. దేశ అవసరాలను బట్టి ఇక ఐదేళ్ల వరకు ఈ పరిమితిని పెంచే అవకాశం కూడా ఉంది అంటూ తెలిపింది. కాగా ఇలా యువకులు ప్రతి ఒక్కరు కూడా ఆర్మీలో పని చేయాలి అనే రూల్ ఇప్పటివరకు 27 దేశాలలో ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: