మనం ఉసిరి కాయను ఎక్కువగా పచ్చడి పెట్టుకొని తినడానికి ఇష్టపడుతుంటాము. అయితే ఉసిరికాయలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. ఉసిరికాయను పోషకాల నిలయంగా చెప్పవచు. ఉసిరికాయ ఇది జలుబు, ముక్కు కారటం నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. మార్కెట్లో లభించే విటమిన్ సీ సప్లిమెంట్లతో పోలిస్తే ఉసిరిలోని విటమిన్ సీ శరీరం ద్వారా సులభంగా గ్రహించబడుతుందని పరిశోధకులు కనుగొన్నారు.

ఆయుర్వేదం ప్రకారం..  ఉసిరి మంచి యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్, ఆస్ట్రింజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. శరీరం యొక్క తెల్ల రక్త కణాల సంఖ్యను పెంచడానికి ఆమ్లా సహాయపడుతుంది. తద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది.ఉసిరి యొక్క ఫైబర్ కంటెంట్ ఎక్కువ కాలం పూర్తి అనుభూతిని కలిగించడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. జీవక్రియను మెరుగుపరచడం ద్వారా కొవ్వును కాల్చడానికి ఆమ్లా సహాయపడుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి. ఉసిరికాయలో ఫైబర్ పుష్కలంగా ఉండి.. ఆహారాన్ని బాగా జీర్ణం చేయడానికి సాయపడుతుంది. తద్వారా మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది.

ఉసిరికాయ ఉత్తమ యాంటీ-ఏజింగ్ పండ్లలో ఒకటి. ఎందుకంటే ఇది చర్మాన్ని ఆరోగ్యంగా, మచ్చలేనిదిగా ఉంచడానికి సహాయపడుతుంది. ఉసిరి ఆకులను పేస్ట్‌గా చేసి తలపైన పూసుకున్నట్లయితే చుండ్రు, జుట్టు రాలిపోవడం, బూడిద నివారణలో సహాయపడుతుంది. జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. ఇక సిరి జ్యూస్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల యూరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించటంలో బాగా సహకరిస్తుంది. ఇంకా యూరినర్ బర్నింగ్ ను కూడా తగ్గిస్తుంది. ఉసిరికాయ వల్ల స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుంది. ఉసిరికాయ ముక్కలను ఉప్పులో నానబెట్టి, తర్వాత ఎండబెట్టి దాచుకోవచ్చు. అప్పుడప్పుడు నోట్లో వేసుకుంటే మంచి శక్తితో పాటు మౌత్‌ ఫ్రెషనర్‌గా కూడా పనిచేస్తుంది.

అంతేకాదు ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడటాన్ని తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించే సామర్ధ్యం ఉసిరి పౌడర్‌కు ఉన్నది. భారతీయ గూస్బెర్రీ సారాన్ని 12 వారాలపాటు తినడం వల్ల తక్కువ సాంద్రత కలిగిన చెడు కొలెస్ట్రాల్, మొత్తం కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ల స్థాయిలు తగ్గుతాయని అధ్యయనాలు తెలిపాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: