ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని ప్రస్తుతం తాలిబన్లు స్వాధీనం చేసుకున్నారు. అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఆయుధాలతో ఎన్నో అరాచకాలు సృష్టించారు.  ఎదురు తిరిగిన వారిని చంపడం..  భయపడిన వారిని బానిసలుగా మార్చుకోవడం లాంటివి చేసి ఎన్నో అరాచకాలతో ఎన్నో ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటూ వచ్చారు  దేశ రాజధాని కాబుల్ ను కూడా స్వాధీనం చేసుకోవడంతో చివరికి అఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం లొంగి పోయే పరిస్థితి వచ్చింది. ఇక ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో  తాలిబాన్లకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది.


 కానీ ఆఫ్ఘనిస్థాన్లో   ఒక ప్రాంతం మాత్రం అటు తాలిబన్లకు అస్సలు లొంగడం లేదు.. ఆ ప్రాంతాన్ని కూడా తమ వశం చేసుకోవడానికి తాలిబన్లు ఎంతగానో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ అక్కడి ప సైన్యం మాత్రం ఏకంగా తాలిబన్లను ఎదిరించి పోరాడుతుంది. తాలిబన్లు ఎంతలా ఇబ్బందులు సృష్టించినప్పటికీ వెనక్కి తగ్గేది లేదు తాలిబన్లకు తలొగ్గేది లేదు అంటూ అక్కడి ప్రజలు తేల్చి చెబుతున్నారు.ఆ ప్రాంతం ఏదో కాదు సింహగర్జన అని పిలుచుకునే పంజ్ షేర్ ప్రాంతం. ఇక ఆఫ్ఘనిస్థాన్లోని అన్ని ప్రాంతాలు తాలిబన్ల ఆధీనంలో ఉన్నప్పటికీ ఆ ప్రాంతం మాత్రం  ఇంకా తాలిబన్ల వశం కాలేకపోయింది.



 అయితే పంజ్ షేర్ సైనికులు సైతం  తాలిబన్లకు కుంగిపోతున్నారు అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఇటీవల ఈ వార్తలను కొట్టిపారేస్తూ మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ లో రక్త పాతం సృష్టిస్తున్న తాలిబన్లకు తలొగ్గేది లేదు అంటూ పంజ్ షేర్ సైనికులు స్పష్టం చేశారు. తాలిబన్లతో రాజీపడబోమని తమ జోలికి వస్తే అంతు చూస్తామంటూ ప్రకటించారు. అందుకు అఫ్ఘనిస్తాన్ ఆర్మీ మాజీ కమాండర్ కూడా తమతో చేతులు కలిపారు అంటూ చెప్పుకొచ్చారు. అయితే అటు పంజ్ షేర్ సైనికులకు దేశ ప్రజల మద్దతుతో పాటు పొరుగు దేశం తజకిస్తాన్  సపోర్ట్ చేస్తూ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: