రాజ‌కీయాల్లో జంపింగ్ ల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఎంత గొప్ప నేత అయినా.. స‌ద‌రు నేత ద‌శాబ్దాల నుంచి ఒకే పార్టీలో ఉన్నా కూడా ఒక్కోసారి పార్టీ మారిపోవ‌డం కామ‌న్‌. మ‌రి కొంద‌రు నేత‌లు అయితే అధికారం ఎక్క‌డ ఉంటే అక్క‌డే వాలి పోతూ ఉంటారు. మ‌రి కొంద‌రు రెండు రోజుల‌కే పార్టీ కండువాలు మార్చిన సంఘ‌ట‌న‌లు మ‌నం ఎన్నో చూశాం. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస‌రావు అయితే ప్ర‌తి ఐదేళ్ల‌కు నియోజ‌క‌వ‌ర్గం తో పాటు పార్టీ కూడా సులువుగా మార్చేస్తూ ఉంటారు. ఆయ‌న అప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారు. వెంట‌నే కండువా మార్చేసి టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యి.. మ‌ళ్లీ టీడీపీ నుంచి ఐదేళ్లు మంత్రిగా ఉన్నారు.

గ‌త ఎన్నిక‌ల‌లో టీడీపీ ఓడిపోవ‌డంతో ఇప్పుడు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. ఆయ‌న‌కు కావాల్సింది అల్లా అధికార‌మే. ఇక పార్టీకి గంటా దూరంగా ఉండ‌డంతో చంద్ర‌బాబు కూడా ప‌ట్టించుకుంటోన్న దాఖ‌లాలు అయితే క‌న‌ప‌డ‌డం లేదు. ఇక త్వ‌ర‌లోనే గంటా జ‌న‌సేన కండువా క‌ప్పుకుంటార‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో జ‌న‌సేన - టీడీపీ పొత్తు ఉంటుంద‌న్న నేప‌థ్యంలో గంటా త‌న‌తో పాటు త‌న వ‌ర్గంతో క‌లిసి జ‌న‌సేన లోకి వెళ్లి పోయి అక్క‌డ చ‌క్రం తిప్పాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

గంటా గ‌తంలో ప్రజారాజ్యం పార్టీలోకి చాలా మందిని తీసుకు వెళ్లి వారికి సీట్లు ఇప్పించుకున్నారు. 2014లో తిరిగి టీడీపీలోకి వ‌చ్చిన‌ప్పుడు కూడా అదే చేశారు. ఇక ఇప్పుడు జ‌న‌సేన లో కూడా అవే కండీష‌న్ల‌తో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ట‌. విశాఖ జిల్లా తో పాటు ఉత్త‌రాంధ్ర లో టిక్కెట్ల ఎంపిక బాధ్య‌త మొత్తం త‌న‌కే వ‌దిలి వేయాల‌న్న‌దే గంటా పెడుతోన్న కండీష‌న్ అట‌. మ‌రి అలా చేస్తే అక్క‌డ అభ్య‌ర్థుల‌కు తాను స్వ‌యంగా ఫండ్ రైజ్ చేస్తాన‌ని కూడా ప‌వ‌న్ కు హామీ ఇచ్చార‌ని అంటున్నారు. మ‌రి ప‌వ‌న్ అందుకు ఒప్పుకుంటారా ? అన్న‌దే చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: