వైసీపీ ప్ర‌భంజ‌నంతో బ‌ల‌మైన టీడీపీ కూడా ప‌రిస్థితి ఒక్క‌సారిగా మారిపోయింది. ఇప్పుడు బ‌ద్వెల్ ఉప ఎన్నిక జ‌ర‌గనున్న నేప‌థ్యంలో ప‌లు పార్టీలు తెర‌పైకి వ‌స్తున్నాయి. అయితే, ఈ క్ర‌మంలో టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, ఒంరి పోరుతో ఇప్పుడున్న ప‌రిస్తితిలో వైసీపినీ ఓడించ‌డం సాహ‌స‌మ‌నే చెప్పాలి. దీంతో రాజ‌కీయంగా పొత్తులు ఉంటాయ‌నే సంకేతాలు క‌నిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మూడు పార్టీలు ఈ దిశ‌గా అడుగులు వేస్తున్నారంటున్నారు ప‌రిశీల‌కులు.


  2014లో న‌వ్యాంధ్ర‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన క‌లిసి ముందుకు వెళ్లాయి. ఈ ఎన్నిక‌ల్లో జ‌న‌సేన ప్ర‌త్య‌క్షంగా పోటీ చేయ‌క‌పోయిన ప్ర‌చారం చేసింది. దీంతో బీజేపీ, టీడీపీ కూట‌మి అధికారంఓకి వ‌చ్చింది. బీజేపీకి ఒక ఎంపీ స్థానంతో పాటు ఏకంగా నాలుగు ఎమ్మెల్యే స్థానాలు వ‌చ్చాయి. ఇక టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప‌దవులు పంచుకున్నారు. అయితే, 2019 ఎన్నిక‌ల్లో మాత్రం ఈ మూడు పార్టీలు ఎవ‌రి దారిలో అవి ప‌య‌నించాయి. దీంతో వైసీపీ ఘ‌న విజ‌యం సాధించింది.


 ఆ తరువాత ఈ గెలుపు ఓట‌ముల లెక్క‌లు చూసుకుంటే జ‌న‌సేన‌కు సీట్లు రాక‌పోయి ఓట్ల శాతం బాగానే న‌మోద‌యింది. జ‌న‌సేన అధినేత రెండు స్థానాల్లో పోటీ చేసినా ఓడిపోయాడు. టీడీపీకి 21 స్థానాలు ల‌భించాయి. అలాగే జ‌న‌సేన 20 నుంచి 30 శాతం ఓట్లు చీల్చింద‌ని ఇవన్ని టీడీపీ ఓట్ల‌ని ఆ పార్టీ నాయ‌కులు లెక్క‌లు వేశారు. ఇక ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-బీజేపీ-జ‌న‌సేన పొత్తుపెట్టుకుని రంగంలోకి దిగితే బాగుంటుంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.


 అయితే, ఇప్ప‌టికే బీజేపీ -జ‌న‌సేన పొత్తులో ఉన్నాయి. 2019లో ఒంట‌రి పోరు కొంప ముంచింద‌నే మాట‌లు ఇప్ప‌టికీ టీడీపీలో వినిపిస్తోంంది. దీంతో గ‌త త‌ప్పులు పున‌రావృతం కాకుండా చూసుకునేందుకు ఆ పార్టీ అడుగులు వేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది.  దీంతో బీజేపీ-జ‌న‌సేన తో పొత్తు పై అంత‌ర్గ‌తంగా అందుతున్న సూచ‌న‌ల‌పై టీడీపీ అధినేత ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. మ‌రోసారి బీజేపీ, టీడీపీ, జ‌న‌సేన క‌లిస్తే గెలుపు త‌ప్ప‌నిస‌రి అనే టాక్ వినిపిస్తోంది.





మరింత సమాచారం తెలుసుకోండి: