ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నారు పవన్ కల్యాణ్. కానీ ఆ పార్టీకి బద్ధశత్రువైన ఆమ్ ఆద్మీ పార్టీని ప్రశంసిస్తున్నారు. అసలేంటి సంగతి. పవన్ కల్యాణ్ కి ఆమ్ ఆద్మీపై ఎందుకంత ప్రేమ. అసలు సడన్ గా ఆమ్ ఆద్మీ పార్టీపై, కేజ్రీవాల్ పై పవన్ కు ఎందుకంత అభిమానం పుట్టుకొచ్చింది. ఇప్పుడిదే చర్చ ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

వీర మహిళలకు జరిగిన శిక్షణ తరగతుల్గొని ఆ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు జనసేనాని పవన్ కల్యాణ్. ఈ సందర్భంగా ఆయన ఆమ్ ఆద్మీపై ప్రశంసలు కురిపించారు. కాంగ్రెస్, బీజేపీ లాంటి పెద్ద పార్టీల వల్ల కూడా మార్పు రాదనుకున్నామని, కానీ కేజ్రీవాల్ స్థాపించిన ఆమ్ ఆద్మీ పార్టీ వల్ల ఆ మార్పు వచ్చిందని చెప్పారు పవన్ కల్యాణ్. అక్రమంగా సారా మీద ప్రభుత్వాలు సంపాదిస్తుంటే, వారికి ఏసీబీని నియంత్రించే హక్కు ఎలా వస్తుందని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. కామన్ మెన్ ప్రొటెక్షన్ పేరుతో గతంలో జనసేన పార్టీ పెట్టామని, అంతే కానీ, పారిశ్రామిక వేత్తలు, ధనవంతుల ప్రొటెక్షన్ కోసం తమ పార్టీ పని చేయదని అన్నారు పవన్ కల్యాణ్. సామాన్యుల ఇబ్బందులను వినడానికి, వాటి పరిష్కారానికి కృషి చేసేందుకే జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు పవన్ కల్యాణ్.

ప్రారంభం ఎప్పుడూ చిన్నదిగానే ఉంటుందని చెప్పారు పవన్ కల్యామ్. బీజేపీ ఇద్దరు ఎంపీలతో తన ప్రస్థానాన్ని ప్రారంభించినా.. ఇప్పుడు కేంద్రంలో ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయికి ఎదిగిందని గుర్తు చేశారు. టీడీపీ అయినా, ఇతర పార్టీలేవయినా వాటి ప్రారంభం చిన్నగానే ఉందని, కానీ ఇప్పుడు అవి కేంద్రాలను శాసించే స్థాయికి ఎదిగాయని అన్నారు. సమాజంలో మార్పు రావాలంటే మహిళలు ముందుండి నడిపించుకోవాలని చెప్పారు పవన్ కల్యాణ్. వైసీపీకి అధికారంపై ఆశ ఉంటే.. జనసేన పార్టీకి సమాజ అభివృద్ధి అనే ఆశయం ఉందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

జనసేన పార్టీ ఎన్నో ఎదురు దెబ్బలు తట్టుకుని నిలబడిందని, ఓటమిని తట్టుకునే శక్తి తమ పార్టీకి ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు. సమాజ క్షేమమే తమ పార్టీ ధ్యేయమని, సమాజంలో సుగాలి ప్రీతి, వనజీవి రామయ్య వంటి వారు గొప్ప వాళ్లు అని చెప్పుకొచ్చారు. వారితో పోల్చి చూస్తే అధికారంలో ఉన్న రాజకీయ నేతలు చాలా అల్పులు చెప్పారు జనసేనాని. అలాంటి అల్పులకు ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలను వేధించే వారిని.. దోపిడీ చేసే వారిని, రాజకీయ బలం చూపించి బెదిరించే వారిని.. ఎదిరించే ధైర్యాన్ని ఇచ్చేందుకే జనసేన ఆధ్వర్యంలో వీర మహిళలకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: