ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 వరకు జగన్ పాలన సాగింది.. 2019 ఎలక్షన్స్ లో 151  సీట్లు సాధించి అద్భుతమైన మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు జగన్. అలాంటి జగన్ 2024 ఎన్నికల్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 11 సీట్లకు పరిమితమై చివరికి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు. అలాంటి ఈయన తన పార్టీని ఎలాగైనా కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతూ ముందుకు వెళ్తున్నారు. అంతేకాదు తన కేడర్ ను కూడా కాపాడుకుంటున్నారు. అలాంటి ఈయన ఒక ఊహించని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీలో అత్యంత బలమైన ఫ్యామిలీగా ఎదిగినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఆయన పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.. వైసిపి ఎప్పుడైతే అధికారం కోల్పోయిందో అప్పటినుంచి ఆ పార్టీలో ఉండే నేతలను టార్గెట్ చేస్తూ టిడిపి అరెస్టులు చేస్తుంది. 

ఇప్పటికే అరెస్టు అయిన వారిలో మాజీ ఎంపీ నందిగాం సురేష్, వల్లభనేని వంశీ మోహన్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కాకాని గోవర్ధన్ రెడ్డి, పెద్దిరెడ్డి కుమారుడు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి  ఉన్నారు. వీరంతా పలు ఆరోపణలతో జైలుకు వెళ్లారు. ఇదే తరుణంలో జగన్ వారికి ధైర్యం కల్పించడం కోసం జైలుకు వెళ్లినా కానీ ప్రత్యేకంగా ములఖత్ కు దరఖాస్తు చేసి వారిని కలిసి ధైర్యం చెప్పారు. అలాగే వంశీ రిలీజ్ అయిన వెంటనే ఆయన తన ఫ్యామిలీని వేసుకొని జగన్ ను కూడా కలిశారు. ఇలా నడుస్తున్న సమయంలో  జగన్ ఆ కుటుంబాన్ని దూరం పెట్టినట్టే తెలుస్తోంది. జైల్లో ఉన్న వాళ్ళందరినీ కలిసినటువంటి జగన్ 72 రోజులుగా జైల్లో ఉన్న పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డిని మాత్రం అస్సలు కలవలేదు. అయితే మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలైన తర్వాత జగన్ ను కలిసేందుకు  వెళ్తే కనీసం నాలుగు రోజులు అవుతున్నా కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదట.

మరి వీరిద్దరూ సీక్రెట్ గా కలిసి మీటింగ్ పెట్టుకున్నారో ఏంటో తెలియదు కానీ, వీరి మధ్య గ్యాప్ ఏర్పడినట్టు సమాచారం. దీన్ని బట్టి చూస్తే మిథున్ రెడ్డి ఫ్యామిలీని జగన్ దూరం పెట్టారని తెలుస్తోంది. దీనికి కారణం కూడా ఉందని సమాచారం. ప్రస్తుతం లోక్సభలో పార్టీ నేతగా కొనసాగుతున్న మిథున్ రాజంపేట నుంచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా పుంగనూరు నుంచి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకా నాథ్ రెడ్డి రంగంలోకి దించి వరుసగా తంబళ్లపల్లి నుంచి రెండుసార్లు గెలిపించారు. ఈ విధంగా పెద్దిరెడ్డి ఫ్యామిలీలో ఒక ఎంపీ, రెండు ఎమ్మెల్యే సీట్లు బలంగానే ఉన్నాయి. ఇలా రాజకీయంగా బలంగా ఉన్నటువంటి ఈ ఫ్యామిలీని ఏ రాజకీయ పార్టీ నాయకుడు వదులుకోడు. కానీ జగన్ మాత్రం వీరి కుటుంబాన్ని పూర్తిగా పక్కన పెట్టినట్టే తెలుస్తోంది. ఈ విధంగా మిథున్ రెడ్డి ఎదుగుదలను చూసి జగన్ ఈ ఫ్యామిలీని పక్కన పెట్టినట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: