గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఇప్పటికీ మింగుడు పడట్లేదని చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలే స్పష్టం చేస్తున్నాయి.. అసెంబ్లీ ఎన్నికలు జరిగి దాదాపు రెండుళ్లు కావొస్తుంది. ఆ ఎన్నికల్లో ప్రజలు టీడీపీ ని తరిమి కొట్టి వైసీపీ ని ఏరికోరి మరీ గద్దె ఎక్కించారు.. మొత్తం 175 సీట్లకు గాను 151 సీట్లు వైసీపీ కి కట్టబెట్టి అధికారం జగన్ కి అప్పగించారు. ఈ తీర్పు తో అప్పుడు బ్లాంక్ అయిన చంద్రబాబు మైండ్ ఇప్పటివరకు కోలుకోలేదు. ప్రజలు తనను ఎందుకు ఆదరించలేదు అని ఇప్పటికీ జుట్టు పీక్కుంటు ఆలోచిస్తున్నాడు..దీనికి తోడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ దూకుడు చూపిస్తున్న విషయం తెలిసిందే. ఓ వైపు ప్రజలకు మంచి పరిపాలన అందిస్తూనే మరోవైపు అవినీతి పరుల అంతు తెలుస్తున్నాడు..