తెలుగు బుల్లితెరపై తన యాంకరింగ్ తో అందరి మనసు దోచిన ఉదయభాను తర్వాత కొన్ని చిత్రాల్లో కూడా నటించారు.  గత కొంత కాలంగా టివిషో లకు దూరంగా ఉంటూ వస్తున్న ఉదయభాను ఇద్దరు కవలలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా ఉదయభాను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిశారు.  
Image result for anchor udaya bhanu husband
కరీంనగర్ జిల్లాకు చెందిన ఉదయభాను కేసీఆర్ ని కలవడం పై ఎన్నో చర్చలు జరుగుతున్నాయి.  ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ..తెలంగాణ ఉద్యమస్ఫూర్తిదాత కేసీఆర్ అంటే తనకు ఎంతో గౌరవం అని..ఆయన ఉద్యమస్ఫూర్తి యావత్ తెలంగాణ వాసులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు.  సీఆర్ లాంటి డైన‌మిక్ లీడ‌ర్‌ను క‌ల‌వ‌డం ప‌ట్ల త‌న‌కు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని పేర్కొంది.
Image result for anchor udaya bhanu husband
ఈ సంద‌ర్భంగా కేసీఆర్‌తో దిగిన ఫొటోల‌ను ఆమె పోస్ట్ చేసింది. ఉద‌యభాను క‌వ‌ల‌ పిల్లల తొలి పుట్టినరోజు వేడుక వ‌చ్చేనెల 3న హైద‌రాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ఈ సంద‌ర్భంగానే ఆమె కేసీఆర్‌ను క‌లిసి, ఆ వేడుక‌కి రావాల్సిందిగా ఆహ్వానించిన‌ట్లు స‌మాచారం.
 


మరింత సమాచారం తెలుసుకోండి: