సచివాలయ ఉద్యోగాల పరీక్షా పత్రం లీకైందంటూ ఆంధ్రజ్యోతి కొన్ని రోజులుగా వరుస కథనాలు ఇస్తోంది. అయితే ఈ కథనాల్లో సరైన ఆధారాలు లేకపోవడంతో రావల్సినంత స్పందన రావడం లేదు. అన్నీ ఊహాగాలు.. కల్పిత కథనాలుగా ఉండటంతో పెద్దగా సంచలనం సృష్టించలేకపోయాయి.


అయితే ఈ విషయంలో పట్టువీడకూడదని భావించిందో ఏమో.. ఆ పత్రిక తాజాగా ఓ కథనం ప్రచురించింది. ఈ ప్రశ్నాపత్రాన్ని ఎస్కేయూ యూనివర్శిటీ ప్రొఫెసర్ తయారు చేసారని.. దాన్ని ఆయన ఓ మంత్రికి ఇచ్చారని.. ఫలితంగా రాబోయే కాలంలో తనకు వీసీ పదవి ఇప్పించాలని కోరారని ఆంధ్ర జ్యోతి కథనం అల్లేసింది. ప్రముఖంగా ప్రచురించింది.


కానీ ఈ కథనం బెడిసి కొట్టింది. తాము అసలు పరీక్ష ప్రశ్నపత్రమే రూపొందించలేదని.. కానీ అనంతపురం ఎస్..కె. యూనిర్శిటీ నుంచి ప్రశ్న పత్రం లీక్ అయిందంటూ ఆంధ్రజ్యోతి వార్తలు రాసిందనీ సదరు ప్రొఫెసర్ అంటున్నారు. తప్పుడు వార్తలు రాసిన ఆంద్రజ్యోతిపై చర్య తీసుకోవాలని సంబందిత ప్రొపెసర్ యూనివర్శిటీ రిజిస్టార్ కు వినతి పత్రం ఇచ్చారు.


తమ యూనివర్సిటీలో హార్టీకల్చర్‌ విభాగమే లేదని, అలాంటప్పుడు ప్రశ్నాపత్రం ఎలా రూపొందిస్తామని ఆ ప్రొఫసర్ అంటున్నారు. ప్రశ్నాపత్రం తయారు చేయాలంటూ ప్రభుత్వం ఎలాంటి సమాచారం ఇవ్వలేదని సెరికల్చర్‌ ప్రొఫెసర్‌ శంకర్‌ నాయక్‌ కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం లక్షల మందికి పైగా ఉద్యోగాలు కల్పిస్తుండడంతో ఓర్వలేక అక్కసుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.


ఆంధ్రజ్యోతి పత్రిక కథనంలో ఏమాత్రం నిజం లేదని ఆయన తేల్చిచెప్పారు. పత్రికపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తమ వర్సిటీ రిజిస్ట్రార్‌కు వినతి పత్రం ఇచ్చానని అన్నారు. అంటే ఆంధ్రజ్యోతి ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలని కావాలనే కథనం అల్లిందా.. మరి అదే నిజమైతే జగన్ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటుందో.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: