ఒకప్పుడు బీసీ సామాజికవర్గాలు తెలుగుదేశం పార్టీకే ఎక్కువ మద్దతిస్తూ ఉండేవి. కానీ జగన్ వచ్చాక ఆ పరిస్థితులు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో ఎక్కువ శాతం జగన్ వైపు వచ్చేశారు. ఎన్నికల్లో మెజార్టీ బీసీ వర్గాలు వైసీపీకే మద్ధతు ఇవ్వడంతో...జగన్ బంపర్ మెజారిటీతో గెలిచారు. అయితే తనని గెలిపించిన బీసీ వర్గాలకు మరింత దగ్గరవ్వడమే లక్ష్యంగా జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి బీసీలు లబ్ది పొందేలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.


అసెంబ్లీ సమావేశాల్లో శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసిన జగన్...ప్రస్తుతం బీసీ కార్పొరేషన్ పేరిట యువకులకు సబ్సీడీ లోన్లు ఇస్తున్నారు. అలాగే అందరితో పాటు బీసీలు కూడా  మిగతా పథకాల ద్వారా లబ్ది పొందుతున్నారు. అలాగే పదవుల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లు అమలు చేస్తూ, వారికి తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఈ క్రమంలోనే బాగా వెనుకబడి ఉన్న రెండు బీసీ వర్గాలపై జగన్ వరాల జల్లు కురిపించారు. 


తాను పాదయాత్రలో హామీ ఇచ్చిన మేరకు మగ్గంపై ఆధార పడి జీవిస్తున్న ప్రతి చేనేత కుటుంబానికి ప్రతి ఏటా రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని అందించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్ చేనేత నేస్తం పేరిట ఈ పథకాన్ని డిసెంబర్ లో ప్రారంభించనున్నారు. అయితే మగ్గంపై ఆధారపడి జీవిస్తున్న నేతన్నలను గుర్తించి వారికి రూ. 24 వేలు అందించనున్నారు. ఈ పథకం డబ్బులని ఒకేసారి చేనేత కార్మికుల ఎకౌంట్ లల్లో డిపాజిట్ చేస్తారు. 


చేనేత కార్మికులతో పాటు,ప్రాణాన్ని ఫణంగా పెట్టి సముద్రంలో వేటకు వెళుతున్న మత్స్యకారులను ఆదుకొనే విధంగా, వేట నిషేధ కాలంలో ప్రతి మత్స్య కార్మికుడికి రూ. 10 వేలు అందివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 21 అంతర్జాతీయ మత్స్య దినోత్సవం రోజున..సీఎం జగన్ పథకాన్ని ప్రారంభించనున్నారు. 
అలాగే వేట చేసే మత్స్యకారులు బోట్లకు వాడే డీజిల్‌పై రూ. 9  సబ్సిడీ ఇవ్వనున్నారు. ఇక త్వరలోనే నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు కూడా రూ. 10 వేలు సాయం చేసేందుకు నిర్ణయం తీసుకొనున్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో బీసీలకు మరిన్ని పథకాలు అందించి వారి పూర్తి మద్ధతు పొందాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: