ఓ వైపు పవన్ కళ్యాణ్ జగన్నే టార్గెట్ గా చేసుకుని జనంలోకి వస్తున్నారు. మరో వైపు ఆ పార్టీలో ఉన్న నాయకులు ఒక్కొక్కరుగా  పార్టీని విడిచి వెళ్ళిపోతున్నారు. క్యాడర్ లేని పార్టీ  జనసేన అని  మంత్రి  అవంతి శ్రీనివాస్ అంటున్నారంటే పవన్ ఆ వైపుగా ఎంత వరకూ ద్రుష్టి పెట్టారో అర్ధం చేసుకోవాలి. ఇక విశాఖకు ఏడు నెలల క్రితం వచ్చిన పవన్ మళ్ళీ నిన్న లాంగ్ మార్చ్  అంటూ హడావుడి చేశారు. అదే సమయంలో ఆయన పార్టీకి గట్టి షాక్ తగిలింది.


విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి  పసుపులేటి బాలరాజు జనసేనకు రాజీనామా చేశారు. పవన్ పార్టీలో ప్రజా సమస్యలపై చర్చించే అవకాశమే లేదని ఆయన విమర్శించారు. పవన్ పార్టీ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారం కూడా కావని అన్నారు. ఓ వైపు ఇసుక సమస్యను ప్రభుత్వం పరిషరిస్తూ ఉంటే  మరో వైపు మార్చ్ ల పేరిట రాజకీయం చేయడం పవన్ కి తగదని ఆయన అన్నారు. తాను అందుకే ఆ పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లుగా బాలరాజ్ఞు పేర్కొన్నారు. అదే సమయంలో విశాఖ ఏజెన్సీకి పెను ముప్పుగా  ఉన్న జీవో 97ను రద్దు చేసి బాక్సైట్  గనుల తవ్వకాలను శాశ్వతంగా నిలుపు చేసిన వైసీపీ సర్కార్ పై ఆయన ప్రశంసలు కురిపించారు.


పాడేరులో మెడికల్ కళాశాల మంజూర్ చేశారని కూడా చెప్పారు.  రానున్న రోజుల్లో మరింతగా అభివ్రుధ్ధి చేస్తారని నమ్మకం ఉందని కూడా బాలరాజు అన్నారు. ఏపీకి,  విశాఖకు మేలు చేసే పార్టీ, అభివ్రుధ్ధి చేసే పార్టీలో తాను తొందరలోనే చేరుతానని ఆయన అన్నారు.  మొత్తం మీద బాలరాజు మాటలు చూసుకుంటే మాత్రం ఆయన వైసీపీలో చేరుతున్నట్లుగా అర్ధమవుతోంది. ఇది ఓ విధంగా పవన్ విమర్శలకు సరైన సమాధానమే.



మరింత సమాచారం తెలుసుకోండి: