మొన్న  జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకొని... వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు హాట్ హాట్ గానే సాగుతున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష టిడిపి పార్టీ విమర్శలు చేస్తూనే  ఉంది. ఈ క్రమంలో రోజురోజుకి ఆంధ్రప్రదేశ్లో టిడిపి క్షీణిస్తుంది. ఇప్పటికే కీలక నేత అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సహా పలువురు కీలక నేతలు టిడిపికి గుడ్బై చెప్పి వేరే పార్టీ తీర్ధం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రోజురోజుకు రాష్ట్రంలో టిడిపి పార్టీ బలం తగ్గి పోతుంది. 

 

 

 

 ఈ నేపథ్యంలో  ఇప్పటికే చంద్రబాబు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటించి పార్టీ స్థితిగతుల పై పర్యవేక్షించారు.కాగా  మరికాసేపట్లో పార్టీ సీనియర్ నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు నివాసంలోనే సీనియర్ నేతలు,  ఎమ్మెల్యేలతో అధినేత చంద్రబాబు భేటీ కానున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపై భేటీలో  చంద్రబాబు చర్చించనున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా రాష్ట్రంలో పార్టీ రోజురోజుకు క్షీణిస్తోన్న తరుణం లో ఈ భేటీలో పార్టీ  సీనియర్ నేతలకు ఎమ్మెల్యేలందరికీ దిశానిర్దేశం చేయనున్నారు అధినేత చంద్రబాబు. అయితే ఇసుక కొరత సమస్యపై నిన్న దీక్ష చేపట్టిన చంద్రబాబు నాయుడు పార్టీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలతో తాజా భేటీ నిర్వహించడం ఆసక్తిని రేపుతోంది. 

 

 

 

 ఇదిలా ఉండగా నిన్న చంద్రబాబు ఇసుక కొరత సమస్య పరిష్కారానికై 12 గంటల నిరసన దీక్ష  చెప్పట్టారు . రాష్ట్రంలో ఏర్పడిన ఇసుక కొరత  సమస్యను తీర్చి  భవన  నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు చంద్రబాబు. వైసీపీ నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రంలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారని... ముఖ్యమంత్రి జగన్ కు ఇంటి దొంగలు కనిపించడం లేదా అంటూ  విమర్శించారు. జగన్ తీసుకొచ్చిన నూతన ఇసుక పాలసీ వల్లే రాష్ట్రంలో ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు చంద్రబాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: