ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ.. ప్రస్తుతం ఉన్న పత్రికాధిపతుల్లో ధైర్యవంతుడనే చెప్పుకోవాలి. తెర వెనుక ఎన్ని కథలు నడుస్తాయో తెలియదు కానీ.. తన పత్రికలో ఆయన చాలా ధైర్యంగా ప్రభుత్వ వ్యతిరేక కథనాలు ఇస్తుంటారు. ఏపీలో సర్కారుతో ఢీ అంటే ఢీ అంటారు. తెలంగాణలోనూ పలుసార్లు నేరుగా ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ కథనాలు ఇచ్చారు. అయితే కొంత కాలంగా ఆయన తెలంగాణ సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై నేరుగా వ్యతిరేక కథనాలు రాయడం లేదు.

 

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ పరిణామాలపై శుక్రవారంనాడు కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్టు వార్తలు వచ్చాయి. తెలంగాణలో పది జిల్లాలను 31 జిల్లాలుగా.. తర్వాత 33 జిల్లాలుగా విభజించినా ప్రజలలో అలజడి ఏర్పడ లేదనీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ కార్యదక్షతకు ఇది నిదర్శనమనీ ఆయన చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది. ఏపీలో రాజధాని మార్పుపై ఆందోళనలు జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారట. దీన్ని రాధాకృష్ణ బోడిగుండుకి – మోకాలికి ముడి పెట్టడమే అవుతుందని కామెంట్ చేశారు.

 

తెలంగాణలో జిల్లాల సంఖ్య పెంచాలనుకున్నప్పుడు కూడా పలు ప్రాంతాల వారు తమ ప్రాంతాన్ని కూడా జిల్లా కేంద్రంగా చేయాలని ఆందోళనలు చేశారని ఆర్కే గుర్తు చేశారు. ఈ కారణంగానే ముందుగా ప్రకటించిన 31 జిల్లాలకు అదనంగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 13 జిల్లాలను లోక్‌సభ నియోజకవర్గం ప్రాతిపదికగా 25 జిల్లాలుగా ఏర్పాటు చేయబోతున్నా ఈ నిర్ణయాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని ఆర్కే గుర్తు చేశారు.

 

కానీ..రాజధాని మార్పు అంటే అలా కాదు కదా? ఇప్పటికే అమరావతిని రాజధానిగా గుర్తించి నిర్మాణాలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాల కోసం పది వేలకోట్ల రూపాయలకు మించి ఖర్చుచేశారు. ఈ దశలో రాజధానిని తరలించడం అంటే ఆందోళనలు తలెత్తకుండా ఎలా ఉంటాయి? అంటూ రాధాకృష్ణ తన కథనంలో ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: