అన్ని నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాదును ఈ సమస్య  తీవ్రంగా వెంటాడి వేధిస్తుంది. నిత్యం ట్రాఫిక్ సమస్యలతో జనాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. నిత్యం ఆఫీసులకు వివిధ పనుల నిమిత్తం వెళ్లేవారు ఈ ట్రాఫిక్ లో చిక్కుకొని సరైన సమయానికి గమ్యానికి చేరుకోలేం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ మెట్రో వచ్చాక ట్రాఫిక్ కష్టాలు కు కాస్త ఊరట లభించింది. ట్రాఫిక్ సమస్యకు ఒక చక్కటి పరిష్కారం లభించినట్టు కనిపిస్తోంది. ఇప్పటి వరకు జేబీఎస్ ఎంజీబీఎస్ మార్గంలోనూ ఇప్పటివరకు అదే రకమైన ట్రాఫిక్ కష్టాలు ప్రజలు ఎదుర్కుంటూ వచ్చారు. తాజాగా ఈ మార్గంలో మెట్రో రైల్ రాకపోకలకు సిద్ధం అవడంతో ప్రజలు ఊరట చెందుతున్నారు.


 జేబీఎస్ ఎంజీబీఎస్ మార్గంలో మెట్రో రైలు ఫిబ్రవరి ఏడో తేదీ నుంచి పట్టాలెక్కబోతోంది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మార్గాన్ని ప్రారంభించబోతున్నారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ హైదరాబాద్ మెట్రో రైలు ట్విట్టర్లో ట్విట్ చేసింది. 2020లో హైదరాబాద్ ప్రజలకు శుభవార్త జేబీఎస్ ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ మధ్య సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి. మరిన్ని అప్డేట్స్ త్వరలో తెలుపుతాము అంటూ ఆ సంస్థ పేర్కొంది. అయితే దీనిపై హైదరాబాద్ ఎంపీ ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ మండిపడుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ చేసిన ట్విట్ పై  ఆయన స్పందించారు. దారుల్ ఫిషా ఫలక్నామా మెట్రో మార్గానికి కూడా నిధులు కేటాయించి జేబీఎస్ మెట్రో ప్రారంభించాలని అన్నారు.

 

 దక్షిణ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి మీ వద్ద ఎటువంటి సమాధానం ఉండదంటూ ఆయన తన ట్విట్టర్లో ప్రశ్నించారు. జేబీఎస్ ఎంజీబీఎస్ మెట్రో మార్గానికి నిధులు పుష్కలంగా ఉన్నాయని, అయితే ఎంజీబీఎస్ నుంచి ఫలక్ నామా మార్గాన్ని ఎప్పుడు ప్రారంభించి.. ఎప్పుడు పూర్తి చేస్తారు అనేది క్లారిటీగా సమాధానం చెప్పాలి అంటూ అసదుద్దీన్ ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు. 

https://twitter.com/asadowaisi/status/1225226486862372864

https://twitter.com/asadowaisi/status/1225225858555625472

 

మరింత సమాచారం తెలుసుకోండి: