ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పుట్టి పెరిగింది హైద్రాబాద్ లోనే. ఆయన వైద్యశాస్త్రం చదువుతూ మధ్యలోనే, రాజకీయాలలో చేరుటకు, వదిలేశాడు. ఆయన నాలుగు సార్లు హైదరాబాదు చాంద్రాయణ గుట్ట నుండి శాసన సభకు పోటీ చేశారు. ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఒవైసీ వివాస్పాద ప్రసంగాలకు ప్రసిద్ధి. ఎందరో సాహితీకారులు, సామాజిక కార్యకర్తలు అక్బరుద్దీన్‌ ఒవైసీ విమర్శించారు. ఆయన హిందువుల పట్ల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడు. 2007 లో సల్మాన్ రుష్దీ మరియు తస్లీమా నస్రీన్ లకు వ్యతిరేక ఫత్వాను పురస్కరించుకుని వారు హైదరాబాదుకు వస్తే తగిన గుణపాఠం నేర్పుతామని ప్రకటించాడు.

 

ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ పై ప్రత్యర్గివర్గం 2011లో దాడి జరిగింది. ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ పైల్వాన్. అక్బరుద్దీన్‌పై దాడి చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న మహమ్మద్ పైల్వాన్ మృతి చెందాడు. గుండెపోటుతో యశోద ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తోంది. 8 సంవత్సరాల క్రితం అక్బరుద్దీన్ పై దాడి చేసిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. గత సంవత్సరంలో ఈ కేసును నాంపల్లి కోర్టు కొట్టేసింది.

 

2011 ఏప్రిల్ 30వ తేదీన అక్బర్ పై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో అక్బర్ శరీరలోకి 2 బుల్లెట్లు, 17 కత్తి పోట్లు దిగాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేల గన్‌ మెన్‌ కూడా ఎదురు కాల్పులకు దిగడంతో దుండగులు పరారు అయ్యారు. ఈ ఘటనలో అక్బరుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంలోకి బుల్లెట్లు, కత్తిపోట్లతో తీవ్ర గాయాలపాలైన అక్బరుద్దీన్‌ను హుటాహుటిన కేర్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆయన శరీరంలో ఇప్పటికీ ఓ బుల్లెట్‌ను డాక్టర్లు బయటకు తీయలేదు. ఈ ఘటన తర్వాత అక్బరుద్దీన్ ఆరోగ్యం అనేక సార్లు క్షీణించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: