శాసనమండలి రద్దు తీర్మానం ఢిల్లీలో చాలా స్పీడుగా దూసుకెళుతోంది. ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం రద్దు తీర్మానం వివిధ దశలను దాటుకుని తాజాగా క్యాబినెట్ ముందుకు చేరుకున్నట్లు సమాచారం. విషయం చూస్తుంటే జగన్ కు నరేంద్రమోడి బాగా సహకరిస్తున్నట్లే కనిపిస్తోంది. క్యాబినెట్ ముందుకు చేరుకుందంటే నరేంద్రమోడి దృష్టిలోకి వెళ్ళినట్లే అనుకోవాలి. ఎందుకంటే క్యాబినెట్ అజెండాలోకి ఏ అంశమైనా ఎక్కాలంటే ముందుగా మోడి అనుమతి కావాల్సిందే. లేదంటే కనీసం కేంద్ర హోంశాఖ మంత్రి  అమిత్ షా దృష్టికైనా వెళ్ళాల్సిందే. మోడి ఆమోదం పొందిన తర్వాతే  అజెండాలో అంశంగా మారుతుంది. అప్పుడు క్యాబినెట్ సమావేశం ముందుకొస్తుంది. చూడబోతే జగన్ అడిగినట్లు మోడి మండలిని రద్దు చేస్తే పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్లే.

 

ఏ అంశమైనా ముందుగా క్యాబినెట్ లో చేర్చించిన తర్వాతే పార్లమెంటు ఉభయసభల్లో చర్చకు రెడీ అవుతుంది. ఒకవేళ క్యాబినెట్ ఆ పర్టిక్యులర్ అంశాన్ని తిరస్కరించినా లేదా  వాయిదా వేసినా పార్లమెంటులో చర్చకు ఆలస్యమవుతుంది. కానీ ఇక్కడ శాసనమండలి రద్దు అంశాన్ని జగన్మోహన్ రెడ్ది ప్రతిష్టగా తీసుకున్నారు. ఎలాగైనా మార్చిలో మొదలయ్యే శాసనసభ బడ్జెట్ సమావేశాల సమయానికి శాసనమండలి రద్దు అయిపోవాలన్న పట్టుదలతో జగన్ ఉన్నారు.

 

జగన్ ఇంత పట్టుదలకు వెళ్ళటానికి చంద్రబాబునాయుడు, యనమల రామకృష్ణుడు చేసిన ఓవర్ యాక్షనే ప్రధాన కారణమని చెప్పాలి. కేవలం మండలిలో తమకు మెజారిటి ఉందన్న ఏకైక కారణంతో ప్రభుత్వం ప్రతిష్టగా తీసుకున్న రెండు బిల్లులను సెలక్ట్ కమిటి పేరుతో చాలా కంపు చేశారు. నిజానికి అసెంబ్లీ ఆమోదించిన బిల్లును మండలిలో టిడిపి మద్దతివ్వాలన్న రూలేమీ లేదు. ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.

 

అయితే  టిడిపి మాత్రం ఈ రెండు మార్గలను కాదని ఛైర్మన్ ను మ్యానేజ్ చేసుకుని సెలక్ట్ కమిటి అనే కంపు మొదలుపెట్టింది. పోనీ సెలక్ట్ కమిటి పరిశీలను పంపటాన్నైనా పద్దతిగా చేసిందా అంటే అదీ లేదు. అంతా కంపు కంపే.  ఈ మొత్తానికి కారణం ఏమిటంటే ఛైర్మన్ కూడా టిడిపి సభ్యుడే అన్న అతితెలివే. అందుకనే వీళ్ళ ఓవర్ యాక్షన్ కు మండిపోయిన జగన్ ఏకంగా మండలి రద్దును ప్రిస్టేజ్ గా తీసుకున్నాడు. మరి ఎప్పటిలోగా రద్దయిపోతుందో చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: