సమస్త మానవాళికి ఇప్పుడు కలుగుతున్న ముప్పు ఒక శాంపిల్ మాత్రమేనట.. ఇక ముందు ముందు ఎన్నో విపత్తులను ఎదుర్కొనక తప్పదని అంటున్నారు.. ఇకపోతే ఐకమత్యమే మహ బలం అని ఎన్నో సార్లు పుస్తకాల్లో చదువుకున్నాం.. కాని ఇప్పుడు ప్రజల్లో అది లోపించింది.. ఎందుకంటే కరోనా అనేదాన్ని ఒక చిన్న అంటువ్యాధిగా భావించి ప్రవర్తిస్తున్నారు..

 

 

నిజానికి దీని ప్రతాపం ఏంటో తెలియాలంటే ఇటలీలో జరుగుతున్న ఘటనలు చాలు.. చైనా ప్రజలు అనుభవించిన, అనుభవిస్తున్న నరకం చాలు.. వీళ్ల కష్టాలు చూస్తే మనుషులుగా బ్రతకడం కంటే చావడం నయం అనిపిస్తుంది.. ఇంక ఎంత కాలం బ్రతుకుతామో తెలియదు గానీ, ఇప్పుడు పరిస్దితి కనుక ఇలాగే కొనసాగితే ఎవరికి ఎవరు కాకుండా ఎంతమంది మరణిస్తారో తెలియదు..

 

 

ఇదంతా తెలిసిన ప్రజల్లో కొందరు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు.. ఇప్పుడు ముంచుకొస్తున్న ముప్పునుండి ప్రాణాలతో భయట పడాలంటే ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో, లేదంటే ఓ బిడ్దకు తండ్రి లేకుండా పోవచ్చూ, భార్యకు భర్త, తల్లికి కొడుకు, చెల్లికి అన్న ఇలా చెప్పుకుంటూ వెళ్లితే ఎన్ని కుటుంబాలు అనాధలా మిగిలిపోతాయో ఊహించుకోండి..

 

 

రెండో ప్రపంచ యుద్దాన్ని మనందరం చూడలేదు.. కానీ ఇది మూడోప్రపంచ యుద్ధం కంటే చాలా భయంకరంగా ఉంది.. ఒకరి దాహానికి ఇలా ప్రపంచాన్ని నాశనం చేసిన వాడు కూడా త్వరగానే నాశనమయ్యే పరిస్దితి వస్తుంది.. అందుకే కలసి కట్టుగా ఉంటూ అధికారులకు సహకరిస్తేనే ఈ కరోనాను త్వరగా అరికట్టవచ్చూ..

 

 

లేదంటే చనిపోయిన వారి దగ్గరికి కూడా ఎవరు వెళ్లలేని దుస్దితులు రావచ్చునంటున్నారు.. మనిషిగా పుట్తాము కాని మనుషుల్లా ప్రవర్తించడం మరచిపోతున్నాము.. కనీసం ఇలాంటి ఆపద సమయంలో అయినా బాధ్యతతో ప్రవర్తించి పుట్టినందుకు ఈ జన్మను సార్ధకం చేసుకుందాం..

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: