కరోనా చైనాలో ఒక పిల్ల కాలువలా మొదలై, ప్రస్తుతం లోకంలో మహాసముద్రంలా ప్రవహిస్తుంది.. ఇప్పటికే ఈ వైరస్ ప్రవాహం తాకిడికి దేశ దేశాలు అల్లకల్లోలం అవుతుండగా.. ఊహించనంతగా ప్రాణ నష్టం జరుగుతుంది.. ఇలాంటి పరిస్దితుల్లో కరోనా ఉగ్రవాదానికి చరమగీతం పాడకపోతే ముందు ముందు మరింతగా సమస్యలు ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది.. ఇకపోతే లోకం మొత్తం కరోనా దాటికి బయటకు రావడమే మానేశారు.. ఇలాంటి పరిస్దితుల్లో కొందరు బాధ్యతరాహిత్యంగా చేస్తున్న, చేసిన పనికి మన గ్రేటర్‌కు ఢిల్లీ ఫీవర్‌ పట్టుకుంది. దీని ఫలితంగా బస్తీవాసుల కంటి మీద కునుకులేకుండా అయ్యింది..

 

 

ఇక ఇప్పటి వరకు విదేశాల నుండి అంటే ముఖ్యంగా చైనా, ఇటలీ, దుబాయ్, స్కాట్‌లాండ్, ఇండోనేషియా, యూకే, యూఎస్‌ఏల నుంచి వచ్చిన వారితో పోలిస్తే.. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీ నిజాముద్దీన్‌ మార్కెట్‌లో నిర్వహించిన తబ్లీఘీ జమాత్‌కు హాజరై వచ్చిన వారితోనే నగరానికి ప్రమాదం పోంచి ఉందని చెబుతున్నారు.. ఎందుకంటే విదేశాల నుంచి వచ్చిన వారిలో కంటే, కరోనా కేసులు ఈ జమాత్‌కు హాజరై వచ్చిన వారిలోనే ఎక్కువ వెలుగు చూస్తుండటం ఇందుకు కారణం. ఇకపోతే ఢిల్లీ నిజాముద్దీన్‌ మార్కెట్‌లో నిర్వహించిన తబ్లీఘీ జమాత్‌కు 1030 మంది తెలంగాణ నుంచి హాజరు కాగా, వీరిలో 603 మంది ఒక్క గ్రేటర్‌ హైదరాబాద్‌ నుంచే ఉన్నారు. వీరంత కరోనా బాంబుల్లా మారితే, ఇప్పటి వరకు మన నగరానికి ఏం కాలేదన్న సంబరం దూరమైపోయి. చైనా, ఇటలో, అమెరికాలకంటే ఎక్కువ ప్రమాదం సంభవించే అవకాశం ఉందంటున్నారు..

 

 

ఎందుకంటే వీరిలో ఇప్పటికే పలువురికి కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడగా, థర్డ్‌ కాంటాక్ట్‌ కూడా చాపకింది నీరులా విస్తరిస్తుంది... ఇక సెకండ్‌ కాంటాక్ట్‌ బాధితులే కాదు.. వారికి క్లోజ్‌కాంటాక్ట్‌లో ఉన్నవారిలో చాలా మంది వివరాలు ఇప్పటికే దొరకడం లేని కారణంగా, ఇటు పోలీసులు, అటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ అధికారులు రంగంలోకి దిగి బస్తీ బస్తీలో జల్లెడపడుతున్నారు.. ఇది ఇలా ఉండగా ఇప్పటికే కరోనా వైరస్‌ ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ కూడా ముగియడం, రోజురోజుకు కేసుల సంఖ్య మరింత పెరుగుతుండటం వల్ల ప్రస్తుతం వైరస్‌ మరింత చురుగ్గా విస్తరించే అవకాశం ఉండటంతో ఇప్పుడు గ్రేటర్‌వాసుల్లో ఆందోళన మొదలైంది.. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: