దేశ రాజధాని ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. భూప్రకంపనలతో ఢిల్లీలో భవనాలు ఊగిపోయాయి. దీంతో ఒక్కసారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. ఢిల్లీ,నోయిడా,ఘజియాబాద్ లో 3-4సెకండ్ల పాటు భూమి కంపించింది. ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో భూ కంప కేంద్రాన్ని గుర్తించారు.ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. భూప్రకంపనలతో ఇళ్లల్లోని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

 

తమ ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఢిల్లీలో భూకంపంపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ప్రతిఒక్కరూ సేఫ్ గా ఉన్నట్లు ఆశిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. ప్రతి ఒక్కరి రక్షణ కోసం తాను ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. కాగా,ఆదివారం(ఏప్రిల్-12)జాతీయ రాజధాని ప్రాంతంలో వాయు కాలుష్యం ఒక గీత పెరిగి "మితమైన(మోడరేట్)"కేటగిరీలో నిలిచింది. ఢిల్లీలో గత వారం,ఎయిర్ క్వాలిటీ "గుడ్"కేటగిరీలో ఉన్న విషయం తెలిసిందే. 

 

గత నెల నుంచి ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతూ వచ్చాయి.  దాంతో లాక్ డౌన్ సీరియస్ గా పాటించారు. ఏప్రిల్-5న దేశప్రజలందరూ దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ విజ్ణప్తి చేసిన విషయం తెలిసిందే. కొంత మంది  ఆకతాయిలు పటాసులు పేల్చడంతో మళ్లీ పొల్యూషన్ పెరిగిపోయిందని అన్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: