జనాల్లో నిలువెత్తున నిర్లక్ష్యం కనిపిస్తోంది. అసలు కరోనా వైరస్ ఎంత ప్రమాదకరమో మరిచిపోయినట్టు గా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నా,ఎవరూ ముందస్తు జాగ్రత్తలు పాటిస్తున్నట్టుగా కనిపించడం లేదు. విందు, వివాహాల పేరుతో గుంపులు గుంపులుగా గుమిగూడుతూనే ఉన్నారు. ఇక మార్కెట్ల లోనూ అదే పరిస్థితి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడడం, ఇలా వేటినీ పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించడంలేదు. కొంతమంది ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటూ, అప్రమత్తంగానే ఉంటున్నట్టు కనిపిస్తున్నా, మెజారిటీ ప్రజలు ఈ నిబంధనలేవీ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా పల్లెల్లో జనాలు యథావిధిగా తిరిగేస్తున్నారు. దీని కారణంగానే ఏపీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య గతంకంటే విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి.

 


 ఇప్పటికే ఏపీలో ఎనిమిది వేల కేసులు పైగా దాటిపోయాయి. రోజుకు 400 వరకు కేసులు నమోదు అవుతూ ఆందోళన కలిగిస్తోంది. ఇక ముందు ముందు కూడా ఈ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరిగిపోతూ వస్తున్నాయి. ఏపీ కూడా ఇప్పుడు ఆ రాష్ట్రాల జాబితాలో చేరిపోయేలా  కనిపిస్తోంది. చాలామంది కరోనా సోకిన వారిని పరిశీలిస్తే వారిలో వైరస్ లక్షణాలు బయటకు కనిపించకుండా ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తున్నారు. దీంతో ఈ వ్యాధి సోకిన వారిని గుర్తించడం కూడా కష్టమవుతోంది. 

 

IHG


వీరి ద్వారా అనేకమందికి వ్యాప్తి చెందుతూ ఉండడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వీటితోపాటు, మరణాల శాతం కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే కొన్ని జిల్లాలోనూ, కొన్ని పట్టణాల్లోనూ, లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి తెచ్చారు. ముఖ్యంగా కర్నూలు, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్న పట్టణాలు, గ్రామాల్లో ఇప్పుడు లాక్ డౌన్  అమలు చేస్తున్నారు. పరిస్థితి ఇదే రకంగా ఉంటే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఇంతకు మించిన మార్గం ప్రభుత్వానికి కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: