టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ త్వరలో అరెస్ట్ కాబోతున్నారని, ఏపీ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో ఆయన నిండా మునిగారని, మరో వారం రోజుల్లో ఆయనకు నోటీసులు అందించి అరెస్టు చేసి, జైలుకు పంపుతారని పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టిడిపిలో కీలక నాయకులైన చాలామంది జైలు బాటపట్టారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో నెలకొన్న అవినీతి, అక్రమాలను ప్రభుత్వం వెలికి తీసింది. ఇంకా ఎన్నో అక్రమాలను వెలికి తీసే పనిలో ఉంది. ముఖ్యంగా ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని, వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి చెబుతూనే ఉంది.


 ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు. ఈ మేరకు ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో భారీగా అవినీతి చోటు చేసుకుందని, మంత్రివర్గ ఉపసంఘం తేల్చింది. ఈ వ్యవహారంలో అనేక ఆధారాలు లభించడంతో, త్వరలోనే లోకేష్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లు పెద్దఎత్తున ప్రచారం జరుగుతుండగా, ఈ వ్యవహారం పై స్పందించిన లోకేష్ ఫైబర్ గ్రిడ్ కు తాను నిర్వహించిన ఐటి శాఖకు ఎటువంటి సంబంధం లేదని వ్యాఖ్యానించారు. వాస్తవంగా ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవహారం గతంలో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడే జరిగింది. 

 

 

దాంతో ఇది తన మెడకు చుట్టుకుంటుంది అనే ఉద్దేశంతో, ముందుగానే ఈ వ్యవహారంలో సంబంధం లేదనే వాదనను లోకేష్ తెరమీదకు తెస్తున్నారు. లోకేష్ ఈ విధంగా వ్యాఖ్యానించడంపై వైసిపి రాజ్యసభ సభ్యుడు, ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి స్పందించారు. ఫైబర్ గ్రిడ్ తో అప్పటి ఐటీ మంత్రికి సంబంధం లేదని లోకేష్ చెబుతున్నారంటే, ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందని ఒప్పుకోవడమే. అని ఆయన వ్యాఖ్యానించారు. " ఫైబర్ గ్రిడ్ కి అప్పటి ఐటీ మంత్రి కి సంబంధం లేదని చెప్పి నాయుడు స్టేట్మెంట్.ఫైబర్ గ్రిడ్ లో అవినీతి జరిగిందా అన్న విషయాన్ని కక్కేసాడు. నీకు కాకపోతే మరి అప్పటి సీఎం మీ నాన్నకు ఉందా ? తండ్రిని ఇరికిస్తున్నావా చిట్టి . ఈవీఎం  దొంగ హరి ప్రసాద్ ని  ఐటీ అడ్వైజర్ గా ఎవరు పెట్టారో చెప్పు. అంటూ విజయ్ సాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా కామెంట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: