కేసీఆర్ ఏది చేసినా సంచలనమే.. తెలంగాణ తీసుకువచ్చే దగ్గరినుంచి నిన్నటి రెవెన్యూ చట్టంలో మార్పుల వరకు అన్ని కేసీఆర్ నిర్ణయాలు చరిత్ర ని తిరగరాసినవే అని చెప్పుకోవాలి..మొదటి సారి ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు ను ప్రవేశపెట్టి ఐక్యరాజ్య సమితి పొగడ్తను సైతం సంపాదించుకుని చరిత్ర సృష్టించారు.. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ దేశంలో ఎవరు ఇవ్వలేదు, రైతు భీమా ఎక్కడా ప్రవేశపెట్టలేదు, ఇంటింటా నల్లా నీరు ఎప్పుడు జరగలేదు ఇలా చెప్పుకుంటే పోతే కేసీఆర్ ప్రజలకు సంక్షేమ పథకాలు సరికొత్తవి ప్రవేశపెట్టి మళ్ళీ ముఖ్యమంత్రి గా గెలిచారు..

రాష్ట్రంలో కేసీఆర్ రైతులను రాజు గా చేయాలనీ చూశారు. రైతు రాజ్యం చేస్తే రాష్ట్రం సుసశ్యామలంగా ఉంటుందని అయన ఆశ.. అందుకే ఆయన మేనిఫెస్టో లో ఎక్కువగా రైతులు లాభపడే పథకాలే ఉంటాయి..  ఇక అయన తెలంగాణ లో రారాజు గా ఉండడానికి కారణం కాంగ్రెస్ ని విమర్శించడమే.. వారి పాలనలో దేశం ఎంత వెనుకపడిపోయిందో రాష్ట్రం ఎలా అయిపోయిందో ప్రజలకు చెప్పడంలో సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు.. ఎన్నికల సమయంలో పూర్తి గా కాంగ్రెస్ ను విలన్ గా  చేసి తన పార్టీ రాష్ట్రానికి సేవ చేసిందని చెప్తూ ప్రజలను నమ్మబరుస్తారు.. నిజానికి ఇది నిజమే అయినా కేసిఆర్ కి తెలిసిన రాజకీయాలు కాంగ్రెస్ నేతలకు తెలియవని చెప్పలి..

ఇక ఇటీవలే జరిగిన ప్రాజెక్టుల్లో ప్రమాదాలు.. హైదరాబాద్ వరదలు తెలంగాణ రాష్ట్ర సమితిని డిఫెన్స్‌లో పడేస్తున్నాయి అని చెప్పొచ్చు.. వాటి వైఫల్యాలకు కూడ కాంగ్రెస్ ను నిందిస్తున్నారు తెరాస నాయకులు.కొన్నాళ్ల కిందట వరకూ.. టీఆర్ఎస్ ఇలా వాదనలు వినిపిస్తే.. కాస్త ఎఫెక్టివ్‌గా ఉండేది. కానీ ఎప్పటికప్పుడు… ప్రజలకు కష్టాలొచ్చినప్పుడల్లా.. వారి కష్టాలను తీర్చేప్రయత్నం చేయకుండా… పక్కనోళ్లపై నిందలేసి.. తప్పించుకునే ప్రయత్నం చేస్తే ప్రజలకైనా చిరాకేస్తుంది. ఇప్పుడా పరిస్థితి వచ్చింది. ఇంత కన్నా మెరుగైన వ్యూహాన్ని టీఆర్ఎస్ నేతలు.. సిద్ధం చేసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: