దేశంలోలాక్ డౌన్ ముగిసిన.. వైరస్ మాత్రం ఇంకా ముగియలేదు అని ఇక రానున్న రోజులు అన్ని పండగల వాతావరణానికి సిద్ధమవుతున్నాయి కాబట్టి కరోనా వైరస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నిర్లక్ష్య వైఖరి పనికిరాదని ప్రధాన నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశంలో ప్రజలు దాదాపుగా 7 -8 నెలనుంచి ఎంతో బాధ్యతాయుతంగా ఓర్పు సహనంతో కరోనా నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకుంటూ దేశ ప్రజలను రక్షించ గలిగాం అయితే ఇకముందు కూడా మనల్ని మన కుటుంబాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పై ఉందని అన్నారు.


అంతేకాకుండా పండగ రోజుల్లో మార్కెట్లు, సంతలు జన సమూహాలు ఒకే దగ్గర గుమికూడి వుండడంతో ప్రస్తుత పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు పడతాం కాబట్టి.. ప్రజలు ఎప్పటిలాగే సామాజిక దూరం, తప్పనిసరిగా మాస్కులు ధరించడం, శానిటైజర్ యూస్ చేయడం మంచిదా నిబంధనను తప్పనిసరిగా పాటించాలి. లాక్ డౌన్ లో మనం పాటించిన కరోనా నిబంధనల వలన మనదేశంలో కరోనా మరణాల రేటు తగ్గింది. మనదేశంలో ఉన్న ప్రతి పది లక్షల జనాభా లో 5500 మంది కరోనా బారిన పడ్డారు. అదే అమెరికా , బ్రెజిల్  ఇలాంటి దేశాల్లో ప్రతి పది లక్షల జనాభాలో 25 వేల మంది కరోనా బారిన పడ్డారు. అయితే ఇప్పుడిప్పుడే అమెరికా, ఐరోపా లాంటి దేశాల్లో మరోసారి కరోనా విజృంభిస్తుంది.


మన దేశంలో వ్యాక్సిన్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నామని, వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి అందజేస్తామని, మోడీ అన్నారు. కరోనా మనల్ని వదిలి పోలేదని దానితో మనం పోరాటం చేస్తున్నామని విషయాన్ని మర్చిపోకుండా ప్రజలు గుర్తించాలని, ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయరాదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 7వ సారి  జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా నిబంధనలు పాటిస్తూ... దేశాన్ని రక్షించాలని మోడీ పిలుపునిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: