ప్రస్తుతం కరోనా  వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఆగిపోయిన ఎన్నికలు వివిధ రాష్ట్రాల్లో ప్రారంభమయ్యేందుకు  రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ప్రచారం ఊపందుకుంది. అయితే గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.  దీనికోసం అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. అంతేకాదు అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు ప్రతివిమర్శలే  కాదు ఏకంగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది..



 ఇక అప్పుడప్పుడే రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో ఇంకొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి అని అనుకుంటున్న తరుణంలో ఎవరూ ఊహించని విధంగా ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ స్థానిక సంస్థల ఎన్నికలను మూడు వారాలపాటు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకొని అధికార పార్టీ కి భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నికల కమిషనర్ పై విమర్శలు గుప్పించిన అధికార పార్టీ కోర్టును ఆశ్రయించినా   అక్కడ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది.



 ఇక ఇప్పుడు కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతున్నప్పటికీ బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు హైదరాబాద్లో జిహెచ్ఎంసి ఎన్నికలు కూడా జరగడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఏపీ రాష్ట్రంలో ఇప్పుడు కరోనా వైరస్ ప్రభావం కారణంగా నిలిచిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలు మళ్లీ నిర్వహించబోతున్నట్లు  గతకొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. తాజాగా దీనిపై స్పందించిన ఏపీ మంత్రి క్లారిటీ ఇచ్చారు. నవంబర్లో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు అని వార్తలు వస్తున్నాయని.. ఏపీ ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదు అంటూ మంత్రి గౌతమ్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినప్పటికీ నవంబర్ నెలలో మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అందుకే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గురించి ఆలోచించడం లేదు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: