కండలు తిరిగి బాహుబలి వంటి శరీరం ఉన్న వారిని సైతం కరోనా కలవర పెడుతుంటే.... ఓ 14 ఏళ్ల బాలిక కరోనాకి చెమటలు పట్టించే ప్రయత్నం చేసి ఫలితం దక్కించుకుంది. అందులోనూ ఆమె అచ్చ తెలుగమ్మాయి కావడం విశేషం. ఆ అమ్మాయి పేరు అనిక...టెక్సాస్‌లోని ఫ్రిస్కోలో ఓ హైస్కూల్‌లో చదువుకుంటోంది. ఆమె పూర్వీకులది ఆంధ్ర ప్రదేశ్ లోని గుంటూరు. కాగా అమెరికాలో టాప్ యంగ్ సైంటిస్ట్-2020 అవార్డుకు ఎంపికయ్యారు. ఇంతకీ ఆమె ఏమి కనుగొన్నారో ఏపీ హెరాల్డ్ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము.....

అసలు కోవిడ్-19 ఇన్ఫెక్షన్‌కు కారణమయ్యే వైరస్ పేరు సార్స్-కోవ్-2. దీని చుట్టూ కిరీటం లాంటి వలయం ఏర్పడి ఉంటుంది. అందుకే దీన్ని కరోనా వైరస్ అని నామకరణం చేశారు. లాటిన్‌లో కరోనా అంటే కిరీటం అని అర్థం అని అందరికీ తెలిసిందే. ఇలా దీని
చుట్టూ ఉండే వలయంలో మేకు ఆకారంలో ఒక ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరంలోని కణాల గ్రాహకాలతో అనుసంధానమై వైరస్ సోకడానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ ప్రోటీన్ కేంద్రబిందువుగా చేసుకొని తద్వారా వ్యాక్సిన్ ను కనుగొనేందుకు పలు సంస్థలు నిరంకుశంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రోటీన్‌పై దాడి చేసినట్లయితే.... వైరస్ మన కణాల్లోకి ప్రవేశించకుండా అడ్డుకోవచ్చు. అందుకనే వైద్య శాస్త్రజ్ఞులు ఈ ప్రోటీన్ ను లక్ష్యంగా పెట్టుకొని వ్యాక్సిన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో  అనిక పరిశోధన చేసి..... ‘‘ఎస్ ప్రోటీన్‌తో అనుసంధానం కాగలిగే ఒక అణువును  కనుగొన్నారు. దీని సహాయంతో వైరస్ స్పందనలు, పనితీరును మార్చవచ్చు’’ అని తెలిపింది. ఇలా చేయడం ద్వారా శరీరంలో ఇతర భాగాలకు వైరస్‌ వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చు. లేదా చికిత్సా మార్గాలు కనిపెట్టడానికి మార్గం లభిస్తోందని’’అని ఆమె వివరించారు. ఇంత గొప్ప ఆవిష్కరణకు గానూ ఆమెకు ‘‘ద 2020 యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్‌’’లో ‘‘టాప్ యంగ్ సైంటిస్ట్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్’’ టైటిల్ దక్కింది. దీనిలో భాగంగా మల్టీనేషనల్ కార్పొరేషన్ 3డీ ఆమెకు 25,000 డాలర్లను బహుమతిగా అందించనుంది.

అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ... నిజంగా ఈ ప్రోటీన్ ఎస్‌ తో ఈ అణువు జత కట్టగలదా? లేదా అని చెప్పడానికి ఎలాంటి పరిశోధన పూర్వక ఆధారాలు కానీ  నిరూపణలు  కానీ లేవనే సంగతిని మనం అర్థం చేసుకోవాలి’’. ‘‘వైరస్‌పై ఈ అణువు పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి ప్రయోగశాలల్లో పరిశోధనలు చేపట్టాలి’ అని ప్రముఖ వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ఏదేమైనా అనిక ఆవిష్కరణ ప్రశంసించదగ్గది. ఆమె ప్రయత్నం మంచి ఫలితాన్ని ఇచ్చి... ప్రపంచ దేశాల ప్రజలకు ఆనందం చేకూర్చాలని అందరూ ఆశిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: