
గత సంవత్సరంలో మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా కూడా ట్విట్టర్ లో ఎక్కువ మంది ట్వీట్స్ చేసిన సినిమాగా రికార్డుకెక్కింది.. అంతేకాదు కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమా కూడా ఎక్కువమంది ట్వీట్ చేస్తూ మరియు హాష్ టాగ్స్ ని సంపాదించింది ..
కాగా సరిలేరు నీకెవ్వరు ట్విట్టర్ లో రికార్డ్ సాధించడం పై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేశారు.
వరుసగా 2018 సంవత్సరం నుండి 2020 సంవత్సరం వరకు వచ్చిన మూడు సినిమాలు ట్విట్టర్ లో రికార్డ్ ల మీద రికార్డ్ లు షేక్ చేస్తున్నాయి ..
మహేష్ బాబు చేసిన ఏ సినిమా అయినా ట్విట్టర్లో ను మరియు యూట్యూబ్లో రికార్డుల మోత మోగవలసిందే... ప్రజలు కూడా మహేష్ బాబు సినిమాల పై చూపుతున్న ఆదరణ కి ఈ స్థాయిలో రికార్డులు రావడం నిజంగా గొప్ప విషయం.. ముందు ముందు మహేష్ బాబు సినిమాలు మరిన్ని రికార్డులు సాధించాలని కోరుకుందాం ..