తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు వి హనుమంతరావు ఎప్పుడు ఎవరో ఒకరు పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఏదో ఒక వివాదాస్పద అంశం ద్వారా వార్తల్లో ఉంటూ వస్తుంటారు. ఆయన ఏం మాట్లాడినా దానికి మీడియాలో మంచి ఫోకస్ లభిస్తుంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు పదవి ఎంపిక జరుగుతోంది. సీనియర్ నాయకులంతా ఆ పదవి తమకు ఇవ్వాలి అంటే తమకు ఇవ్వాలి అంటూ అధిష్టానం పెద్దల వద్ద హడావుడి చేస్తున్నారు.
అలాగే
వి హనుమంత రావు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ పై సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైన పెద్ద దుమారమే నడుస్తుంది. ఇది ఇలా ఉంటే,
సూర్యాపేట జిల్లా లోని దొండపాడు లో
వంగవీటి రంగ విగ్రహాన్ని విహెచ్ ఆవిష్కరించారు.
వంగవీటి రంగ రాబోయే రోజుల్లో
ముఖ్యమంత్రి అవుతాడు అని
హత్య చేశారని విహెచ్ సంచలన ఆరోపణలు చేశారు.రాష్ట్రంలో మూడు శాతం ఉన్న సామాజిక వర్గం వారు
కాంగ్రెస్ పార్టీని నాశనం చేయాలని చూస్తున్నారని, బీసీలకు పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వాలి అన్నందుకు తనకు
ఫోన్ చేసి మరి బెదిరిస్తున్నారని, ఆ బెదిరింపులకు భయపడను అంటూ వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా
జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ ప్రస్తావన తీసుకువచ్చారు. ఏపీలో 27 శాతం ఉన్న కాపులు రాజ్యాధికారం సాధించాలని ఆకాంక్షించారు.
వంగవీటి రంగా తర్వత
పవన్ కళ్యాణ్ కు ఆ వేవ్ ఉందని చెప్పారు.పవన్ కనుక
కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇప్పిస్తాను అని
వీహెచ్ వ్యాఖ్యానించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.