కృష్ణా జిల్లా టీడీపీ పేరు చెబితే...ఎక్కువగా గుర్తొచ్చేది మాజీ మంత్రి దేవినేని ఉమానే. గత రెండు దశాబ్దాల నుంచి టీడీపీలో పెత్తనం ఈయనదే. జిల్లాలో టీడీపీ తరుపున బడా నేతలున్న, ఉమా అండర్‌లో ఉండాల్సిందే అని విధంగా రాజకీయాలు జరుగుతూ వచ్చేవి. ఉమాకు జిల్లాలో మెజారిటీ నియోజకవర్గాల్లో పరిచయాలు ఉన్నాయి. అందుకే ఆయన ఆ నియోజకవర్గాలపై పెత్తనం చేయడానికి చూసేవారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలకు ఇది ఇష్టం లేకపోయినా, తప్పక దేవినేని అండర్‌లో నడిచేవారు. ఎందుకంటే ఉమా చంద్రబాబుకు దగ్గరగా ఉండే వ్యక్తి.

అయితే ఉమా గెలిచినన్నీ రోజులు టీడీపీలో ఇదే పరిస్తితి నడిచింది. ఉమా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే గత చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక అప్పటివరకు ఉమా హవా నడిచింది. కానీ 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో ఉమా ఘోరంగా ఓడిపోయారు. ఇలా ఉమాకు జగన్ షాక్ తగలడంతో, జిల్లా టీడీపీ నేతలకు బాగా కలిసొచ్చింది.

జిల్లాలో ఆయన మాట వినే నేతలు తక్కువయ్యారు. పైగా ఉమా కూడా ఇతర నియోజకవర్గాల జోలికి వెళ్ళడం కూడా తగ్గించేశారు. కేవలం తన నియోజకవర్గం మైలవరం పరిధిలోనే ఉంటున్నారు. అలాగే అప్పుడప్పుడు అమరావతి వెళ్ళి రైతులకు మద్ధతు తెలుపుతున్నారు. అలాగే తన సొంత నియోజకవర్గం నందిగామలో కూడా తిరుగుతున్నారు. అంతే తప్పా జిల్లాలో ఇతర నియోజకవర్గాల జోలికి వెళ్ళడం లేదు. ముఖ్యంగా విజయవాడ నగరం వైపు వెళ్ళడం లేదు.

ఎందుకంటే ఇక్కడ కేశినేని నాని హవా ఎక్కువగా కనిపిస్తోంది. పైగా 2019 ఎన్నికల్లో ఎంపీగా గెలవడం నానికి బాగా అడ్వాంటేజ్ అయింది. అలాగే తన పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్నీ నియోజకవర్గాలపై పట్టు తెచ్చుకుంటున్నారు. ఉమాని మాత్రం విజయవాడ రాజకీయాల్లో వేలు పెట్టనివ్వడం లేదు. ఇప్పుడున్న పరిస్తితిల్లో జిల్లాలో నానికే లీడ్ ఉన్నట్లు కనిపిస్తోంది. ఇటు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఉన్నారు. మొత్తానికైతే కృష్ణా జిల్లాలో దేవినేని ఉమాని సైడ్ చేసినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: