ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం అయింది అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గాంధీ ఆస్పత్రిలో ప్రారంభించారు. అయితే ప్రస్తుతం వ్యాక్సిన్ పై  ప్రజలలో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి అనే విషయం తెలిసిందే. వ్యాక్సిన్ పై సోషల్ మీడియాలో వింత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలందరూ వ్యాక్సిన్ విషయంలో అయోమయంలో పడిపోతున్నారు. ఈక్రమంలోనే వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అనే దానిపై అందరిలో సందిగ్దత నెలకొన్నది.



 ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ముందుకొచ్చి మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకొని ప్రజలలో  నమ్మకాన్ని కలిగించారు  అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలో కూడా ఈ ప్రక్రియ ప్రారంభం కాగానే తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మొదటి టీకా వేయించుకుంటారు అని ప్రచారం కూడా జరిగింది. ఇక అన్ని రాష్ట్రాలలో లాగానే తెలంగాణలో కూడా ఇదే జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నట్లుగా మొదటి టీకా  ఆరోగ్య శాఖ మంత్రి కాదు..  పారిశుద్ధ్య కార్మికురాలు కృష్ణమ్మ కు  ఇచ్చారు.  అయితే ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన ఈటల రాజేందర్ తాను వ్యాక్సిన్ ఎందుకు వేసుకోలేదో  చెప్పుకొచ్చారు.




 ప్రాణాలకు తెగించి కరోనా  వైరస్ వ్యాప్తి జరుగుతున్న సమయంలో డాక్టర్లు నర్సులు శానిటేషన్ సిబ్బంది కరోనా  వైరస్ పై యుద్ధం చేశారని.. ప్రాణత్యాగం కూడా చేశారు అంటూ గుర్తుచేశారు ఈటల రాజేందర్. ప్రధాని మోదీ వారికి ముందు వ్యాక్సిన్  అందించాలని సూచించారు. అందుకే మొదటి వ్యాక్సిన్.. పారిశుద్ధ్య కార్మికురాలు  కృష్ణమ్మకు ఇచ్చామని.. అందుకే తాను  మొదటి వాక్యం తీసుకోలేదు అంటూ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు. ఇక ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం కరోనా బాధితులకు వైద్యం  అందించామని ఈటల రాజేందర్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: