తెలంగాణాలో భారతీయ జనతా పార్టీ నేతలు ఈ మధ్య కాలంలో స్పీడ్ పెంచారు. రాజకీయంగా తెలంగాణాలో అన్ని విధాలుగా బలోపేతం కావాలని భావించిన బిజెపి నేతలు కాస్త స్పీడ్ గా వ్యవహరిస్తున్నారు. అందుకే తెరాస పార్టీ నేతలను కూడా ఈ మధ్య కాస్త స్పీడ్ గా తమ పార్టీలోకి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లాలో ఒక సభ జరిగింది. ఈ సభకు బీజేపీ ఇంఛార్జ్ తరుణ్ చుగ్, బండి సంజయ్, డీకే అరుణ, విజయశాంతి, లక్ష్మణ్, మురళీదరరావు, సత్యకుమార్ తదితరులు హాజరయ్యారు.

మాజీ మంత్రి చంద్రశేఖర్  బిజెపిలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏప్రిల్ ఒకటో తేదీన కేసీఆర్ దళితుడిని ముఖ్యమంత్రిని  చేస్తాడంటోన్న మాజీమంత్రి... కాబోయే సీఎం దళితుడో.. కాదో త్వరలో చెప్తానుఅని అన్నారు.  మూడెకరాల భూమి ఇస్తానని సీఎం కేసీఆర్ దళితులను మోసం చేశాడు అని ఆయన ఆరోపించారు.  పంచాయతీ సర్పంచ్ లను కలెక్టర్లు సస్పెండ్ చేస్తే.‌. చీఫ్ సెక్రటరీకి సైతం ముఖ్యమంత్రిని సస్పెండ్ హక్కుంది అని ఆయన అన్నారు.  నిధులు ఇవ్వకుండా కేసీఆర్ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్నాడు అని మండిపడ్డారు.

ఎన్నికల హామీలను అమలు చేయటంలో కేసీఆర్ విఫలం అని ఆయన ఆరోపించారు. హామీలు అమలు చేయకుంటే.. తల నరుక్కంటానన్న కేసీఆర్ పై డీజీపీ నాన్ బెయిల్ బుల్ కేసు నమోదు చేయాలి అని ఆయన డిమాండ్ చేసారు. వికారాబాద్ ను జోగుళాంబ జోన్ నుంచి తప్పించి హైదరాబాద్ జోన్ లో కలపాలి అని ఆయన కోరారు. వికారాబాద్ కు బస్టాండు, ఓవర్ బ్రిడ్జి, ఆసుపత్రులు, కళాశాలలు తీసుకొచ్చిందే నేను అని అన్నారు. వికారాబాద్ కు మెడికల్ కళాశాల తీసుకురావాలన్న హామీని బీజేపీ ద్వారా సాధిస్తాను అని ఆయన స్పష్టం చేసారు. రామమందిరం నిర్మాణానికి ప్రతి హిందువులు పది రూపాలైనా జమ చేయాలి అని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: