ఆంధ్రప్రదేశ్ లో
స్థానిక సంస్థల ఎన్నికల్లో
వైసీపీ ఓటమికి ప్రధాన కారణం ఏంటీ అంటే కొంత మంది మంత్రులు... అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతున్నాయి. మంత్రుల నియోజకవర్గాల్లో కూడా అధికార
వైసిపి ప్రభావం చూపించలేకపోవడం దారుణంగా మారింది.
ఉత్తరాంధ్ర జిల్లాల్లో
వైసిపి పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. మంత్రులు కొంత మంది సమర్థవంతంగా పని చేయలేక పోవడం వల్లనే ఈ ఫలితాలు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది మంత్రులు ప్రజలతో పాటు
స్థానిక నేతలకు కూడా అందుబాటులో లేకుండా పోయారు.
మంత్రి పదవులు వచ్చిన తర్వాత కొంతమంది అమరావతిలో లేకపోతే మరో ప్రాంతంలో ఉండటమే గాని నియోజకవర్గాలకు వెళ్లడం మానేసారు అని చెప్పాలి. కొంతమంది మంత్రులు హైదరాబాదులో వ్యాపారాలు చేసుకుంటూ అక్కడ ఎక్కువ సమయం గడుపుతూ వస్తున్న పరిస్థితి. దీని కారణంగా ప్రజల్లో
వైసిపి పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోతుంది అని చెప్పాలి. కొంత మంది మంత్రులతో సన్నిహితంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా వ్యాపారాలు మీద దృష్టిపెట్టి గత పదేళ్లలో నష్టపోయిన మొత్తం సంపాదించుకునే ఆలోచన చేస్తున్నారు.
దీనివలన
వైసిపి లాభం పొందే అవకాశాలు ఏమాత్రం లేవు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. రాజకీయంగా
ముఖ్యమంత్రి జగన్ బలం గా ఉన్నారని
వైసీపీ నేతలు పదేపదే చెబుతున్న సరే వాళ్ళు మాత్రం ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయక పోవడంతో
పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. ముఖ్యనేతలు కూడా ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉండటానికి ఇష్టపడకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఉందని కొంతమంది
వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా
వైసిపి ఓటమికి కీలక నేతలే కారణమనే అభిప్రాయం కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. మరి భవిష్యత్తులో అయినా సరే
ముఖ్యమంత్రి జగన్ కొంతమందిని కట్టడి చేసే విషయంలో జాగ్రత్తగా ఉంటారా లేదో చూడాలి. లేకపోతే ఇలాంటి ఫలితాలే వస్తాయని అంటున్నారు.