
ఈ విషయం పై ఎన్నికల కమీషన్ కూడా సీరియస్ అయ్యింది. దాంతో ఎన్నికల కమీషన్ నిమ్మగడ్డ ప్రసాద్ రాష్ట్రంలోనీ పలు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పుంగనూరులో పర్యటించేందుకు గాను రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిన్న రాత్రి పుంగనూరు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు పుంగనూరులో ఆయన పర్యటించాల్సి ఉంది. మూడో విడత పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవ లను ఆయన పరిశీలించాలని అక్కడికి వెళ్లారు..అయితే పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఎన్నికల సంఘం అధికారులు పోలీసులను కోరడంతో పోలీసులు అభ్యంతరం తెలిపినట్లు తెలుస్తోంది.
శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉందన్న పోలీసులు ఏర్పాటు చేయలేమని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే కోర్టు తీర్పుతో పుంగనూరు లో పర్యటించి ఏకగ్రీవ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు పోలీసులకు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరి నిమ్మగడ్డకు పోలీసులు భద్రత కల్పిస్తారు లేక చేయలేమని చేతులెత్తేసిన అనేది ఆసక్తికరంగా మారింది. ఏమవుతుంది అనేది మాత్రం చూడాల్సిందే..ఫిబ్రవరి 17 న జరగనున్న మూడో విడత ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.. ఎవరి జెండా గెలుపును దక్కించుకుంటుంది అనేది చూడాలి..