ఈ కాలంలో చాలా మంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో తలలో దురద కూడా ఒకటి.ఇలా తలలో దురద రావడానికి అనేక రకాలైన కారణాలు ఉండవచ్చు. అందులో ముఖ్యంగా చుండ్రు,పేలు,దుమ్ము, ధూళి అనేవి కారణం అవుతాయి. అయితే మాటి మాటికీ ఇలా  తరచుగా తలలో దురద వస్తూ ఉంటే చిరాకు, కోపం, ఇరిటేష‌న్ వస్తూ ఉంటుంది కదా.ఈ దురద బాధ పడలేక రక రకాల ప్రయత్నాలు చేస్తాము. కానీ ఎన్ని చేసిన, వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టిన గాని  పెద్దగా ప్రయోజనం కనబడడం లేదని విచారించే వాళ్ళకి ఇలాంటి  కొన్ని ఇంటి చిట్కాలు  పాటిస్తే సరి. తలలో దురద సమస్య నుండి బయట పడవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటో ఒకసారి చూద్దామా.



ముందుగా కొన్ని మందారపువ్వులు,మందార ఆకులను కలిపి మెత్తని పేస్ట్ గా చేసి త‌ల‌కు, కుదుళ్లకు బాగా పట్టించాలి. ఒక అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.  ఈ విధంగా వారంలో కనీసం  2 సార్లు చేస్తే తలలో  దురద సమస్య నుండి బయట పడవచ్చు. అలాగే మీ అందరికి బాదం పప్పులు గురించి తెలిసే ఉంటుంది. కొన్ని బాదం పప్పులను పొడిగా చేసుకొని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.



అలాగే బీట్ రూట్ జ్యూస్ లో గోరింటాకు పొడి,పెరుగు కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే దురద సమస్య తగ్గటమే కాకుండా జుట్టు ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.అలాగే కరివేపాకులో కొంచెం మజ్జిగ పోసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకుని తలకి పట్టించాలి.ఒక అరగంట అయ్యాక తల స్నానం చేయాలి.  ఇలా చేయడం వలన తలలో చుండ్రుతో పాటు దురద కూడా మాయం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: