కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రజలకు అనేక అనుమానాలు ఉన్న సంగతి తెలిసిందే. వ్యాక్సిన్ వేసుకోవాలా వద్దా అనే దానిపై చాలామంది భయపడుతూనే ఉన్నారు. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం వ్యాక్సిన్ విషయంలో ఎటువంటి భయాలు అవసరం లేదని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని కోరుతున్నారు. అయితే చాలా మంది ఇప్పటి వరకు కూడా వ్యాక్సిన్ విషయంలో ముందుకు రాకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా వ్యాధి సోకుతుంది అనే వ్యాఖ్యలు ఎక్కువగా వినబడుతున్నాయి.

అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అలాగే ఐసీఎంఆర్ లెక్కలు విడుదల చేశాయి. భారత్ బయోటెక్ తయారు చేసిన వాళ్లకు 0.4 శాతం మాత్రమే కరోనా సోకినట్టు వెల్లడించారు. మొదటి డోస్  రెండవ డోస్  తీసుకున్న వాళ్లకు కేవలం 0.4 శాతం మందికి కరోనా సోకింది అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీరం ఇన్స్టిట్యూట్ తయారుచేసిన వ్యాక్సిన్ తీసుకున్నవారిలో మొదటి డోసు తీసుకున్న వాళ్లకు 11 వేల మందికి కరోనా రాగా తీసుకున్న వాళ్ళు కేవలం 5,000 మందికి మాత్రమే వచ్చింది అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఈ వ్యాక్సిన్ ని మొత్తం 13 కోట్ల మంది వరకు తీసుకున్నారు. దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎవరికి కూడా ప్రాణాపాయం లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. చిన్నచిన్న అనారోగ్యాలు మినహా ఎక్కడా కూడా ప్రమాదకరమైనది ఏమీ లేదని కాబట్టి వ్యాక్సిన్ విషయంలో తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రజలను విజ్ఞప్తి చేసింది. స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తీసుకుంటే ప్రమాదం ఉండదని మొండి పట్టుదలతో ముందుకు వెళ్లవద్దని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: