
తాజాగా ఇలాంటిదే మరో ఘటన వెలుగు చూసింది.. చత్తీస్‌గఢ్ లోని సూరజ్ పూర్ జిల్లా లో లాక్‌డౌన్ అమలవుతున్న సమయంలో కలెక్టర్ ఒక యువకుని పై చేయిచేసుకున్నారు. అంతేకాకుండా అక్కడున్న పోలీసులు కూడా ఆ యువకుణ్ణి కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ కావడం తో కలెక్టర్ క్షమాపణలు చెప్పారు. కలెక్టర్ చేతిలో దెబ్బలు తిన్న ఆ యువకుడిని అమన్ మిట్టల్ గా గుర్తించినట్లు సూరజ్‌పూర్ జిల్లా పోలీసు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించినందున అతనిపై కేసు నమోదైంది.
ఈ వీడియోలో ఉన్న దృశ్యాల ప్రకారం మాస్క్ పెట్టుకున్న ఒక యువకుడు కలెక్టర్‌కు ఒక కాగితంతో పాటు మొబైల్ ఫోన్‌లో ఏదో చూపించడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలో కలెక్టర్ అతని ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టారు. తరువాత ఆ యువకునిపై చేయిచేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు కూడా ఆ యువకుడిని కర్రతో కొట్టారు. ఆ యువకుడిని కొట్టాలని కలెక్టర్ ఆదేశించడం ఆ వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో కలెక్టర్ క్షమాపణలు కోరారు. లాక్ డౌన్ సమయంలో బయటకు వచ్చిన యువకుడిని కొట్టిన ఉదంతానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన ప్రవర్తనకు హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానని, అతనిని కావాలని కొట్టలేదని చెప్పుకొచ్చాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా నిబంధనలను తప్పక పాటించాలని కోరారు.