ఆంధ్రప్రదేశ్ లో  రాజ్యసభ పదవి విషయంలో చిరంజీవి కాస్త పట్టుదలగా వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చెప్పే మాట. 2019 తర్వాత రాజ్యసభ పదవి కోసం చిరంజీవి కాస్త గట్టిగానే ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రి జగన్ తో కూడా భేటీ అయ్యారు. అయితే వైసీపీ గెలుపు లో తన వంతు పాత్ర పోషించిన మోహన్ బాబు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేయడంతో చిరంజీవి కాస్త వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం జరిగింది. రాజ్యసభ సీటు విషయంలో జగన్ అప్పుడు చిరంజీవి కి గాని మోహన్ బాబు కి గాని ఇవ్వడానికి ఆసక్తి చూపించలేదని క్లియర్ గా అర్థమైంది.

అయితే ఇప్పుడు చిరంజీవి మాత్రం ఖచ్చితంగా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అనే మాట వినబడుతోంది. వైసీపీ ప్రభుత్వం కూడా కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకునే ఉద్దేశం లో భాగంగా చిరంజీవికి రాజ్యసభ సీటు ఇస్తే మంచి ఫలితం ఉంటుంది అని అంచనా వేసుకుంటుంది. అటు చిరంజీవితో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్నా సరే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి కాపు సామాజిక వర్గం ఓట్లు తమకు మాత్రమే పడే విధంగా వైసీపీ చిరంజీవిని గౌరవించాలి అని భావిస్తోందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఈ నేపథ్యంలోనే చిరంజీవి కూడా కాస్త పట్టుదలగా వ్యవహరిస్తూ త్వరలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్ లో సినిమా పరిశ్రమకు రాయితీలతో పాటు షూటింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం అదేవిధంగా విశాఖలో ఒక స్టూడియో నిర్మాణం అలాగే తన రాజ్యసభ సీటు కోసం కొంత మంది తో కలిసి చిరంజీవి జగన్ తో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఈ భేటీలో ఒక ప్రముఖ నాయకుడు కూడా పాల్గొనే అవకాశాలు ఉండవచ్చు అని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వచ్చే నెలలో ఈ పరిణామం చోటు చేసుకోవచ్చు అనేది ఎక్కువగా వినబడుతున్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: